E-Paper
Advertisement

పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమే.. నివేదికపై చర్యలొద్దన్న హైకోర్టు, కేసీఆర్-హరీష్‌రావులకు రిలీఫ్

పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమే.. నివేదికపై చర్యలొద్దన్న హైకోర్టు, కేసీఆర్-హరీష్‌రావులకు రిలీఫ్
Advertisement

KCR-Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్‌ను తెలంగాణ హైకోర్టు సమర్థించింది. అయితే నివేదికపై చర్యలు తీసుకోవద్దని తీర్పు వెళ్లడించింది. న్యాయస్థానం తీర్పుతో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌తో‌పాటు ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్‌కె జోషిలకు చిన్న ఊరట లభించింది.

పీసీ ఘోష్ నివేదికపై కేసీఆర్-హరీష్‌రావులకు స్మాల్ రిలీఫ్

Advertisement

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రిపోర్టుపై దాఖలైన పిటిషన్‌లపై బుధవారం తెలంగాణ హైకోర్టు తీర్పు వెళ్లడించింది. ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావులకు ఊరట లభించింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నిబంధనలు పాటించలేదని పేర్కొంది. కమిషన్ వివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని తన తీర్పులో ప్రస్తావించింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ని నియమించింది. ఆ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై నివేదికను కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చింది. కమిషన్ నియమిస్తూ 2024 మార్చి 14న జారీ చేసిన జీవో 6ను సవాలు చేశారు కేసీఆర్- హరీశ్‌రావు, ఐఏఎస్‌ అధికారులు స్మితా సభర్వాల్, ఎస్‌‌కె జోషిలు.

Advertisement

పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమే.. నివేదికపై చర్యలొద్దన్న హైకోర్టు

సెక్షన్ 8 B , సెక్షన్ 8 C కింద నోటీసులు ఇవ్వకుండా తమ వాదనలు పరిగణలోకి తీసుకోలేదని ప్రస్తావించారు. పిటిషనర్లు వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఆ పిటిషన్లపై హైకోర్టు బుధవారం తన తీర్పు వెల్లడించింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను నిలుపుదల చేసింది. దాని ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తేల్చి చెప్పింది.

విచారణ సమయంలో నిబంధనలు పాటించలేదని పేర్కొంది. దీనిపై సీనియర్ అడ్వకేట్ గండ్రమోహన్‌రావు మాట్లాడారు. కమిషన్ ఏర్పాటును హైకోర్టు సమర్ధించిందన్నారు. హైకోర్టు తీర్పుతో కమిషన్ రిపోర్టు చెల్లదన్నారు. హైకోర్టు తీర్పుపై స్పందించారు మాజీ మంత్రి హరీశ్‌రావు. ఎవరెన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయం, ధర్మమే గెలుస్తుందని ఎక్స్ వేదికగా తెలిపారు. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు ఆయన.

ALSO READ: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. 18 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు 

హైకోర్టు తీర్పుతో తమకు లాభం చేకూరిందని బీఆర్ఎస్ భావిస్తోందన్నారు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్. ఘోష్ కమిషన్ చట్టబద్ధమేనని చెప్పిందని, తాత్కాలికంగా చర్యలు తీసుకోవద్దని మాత్రమే చెప్పిందన్నారు. దీనిపై సీబీఐ నివేదిక వస్తుందని అప్పుడు అసలు నిజం బయటకొస్తుందన్నారు. న్యాయస్థానం తీర్పు వెల్లడించడంతో సీబీఐ రంగంలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×