E-Paper
Advertisement

కవిత కొత్త పార్టీ ప్రకటన.. గుర్తు, జెండా ఇదేనా? ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

కవిత కొత్త పార్టీ ప్రకటన.. గుర్తు, జెండా ఇదేనా? ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్
Advertisement

Telangana Politics: తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ రెడీ కానుందా? బీఆర్ఎస్ హైకమాండ్‌లో గుబులు మొదలైందా? కొత్త పార్టీపై తెలంగాణ జాగృతి చీఫ్ కవిత శనివారం ప్రకటన చేయనున్నారా? పార్టీ జెండా, అజెండాపై కూడా ప్రకటన చేయనున్నారా? ఇంతకీ బీఆర్ఎస్ నుంచి కవిత వైపు ఎంతమంది వెళ్తున్నారు? ఇదే ప్రశ్న చాలామందిని వెంటాడుతున్నాయి.

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భావం

Advertisement

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ రెడీ అయ్యింది. మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత శనివారం కొత్త పార్టీ పేరుపై ప్రకటన చేయనున్నారు. ఆ పార్టీ ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్ గా అందిస్తోంది. శనివారం అధికారికంగా పార్టీ పేరు, జెండా కలరు, గుర్తును అధికారికంగా ప్రకటించనున్నారు.

అందుకోసం మేడ్చల్‌ జిల్లాలోని మునిరాబాద్‌ వేదికగా కానుంది. శనివారం ఉదయం పది గంటలకు ప్రకటన రానుంది. పార్టీ రంగు బ్లూ అండ్ ఎల్లో ఉండనుందట. ఆ కలర్‌లో జెండా కూడా ఉండనుంది. పార్టీ గుర్తు గంట ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ పేరు ఓన్లీ ‘తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ’గా కవిత పిక్స్ సమాచారం.

Advertisement

కొత్త పార్టీ ఆవిర్భావ సభకు తెలంగాణవ్యాప్తంగా జాగృతి శ్రేణులతోపాటు కవిత మద్దతుదారులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. అంతేకాదు కొందరు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్‌లోని చాలామంది నేతలతో ఆమె మంతనాలు చేస్తున్నారు.

శనివారం ప్రకటన చేయనున్న కవిత..  సభకు అంతా రెడీ, బీఆర్ఎస్ నేతల ఆరా

బీఆర్‌ఎస్‌ పాలనలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని మొదటి నుంచి కవిత ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. నూతన పార్టీలో వారికి సముచిత స్థానం కల్పించనున్నారట. అందుకే శనివారం సభకు ఉద్యమకారులను ఆహ్వానించారు ఆమె. కవిత పార్టీ సభకు వేలాది మంది ఉద్యమకారులు, ఎన్జీవోలు, మేధావులు హాజరవుతున్నట్లు జాగృతి సంస్థ చెబుతోంది.

ఈ సభ కోసం అన్ని జిల్లాల నుంచి భారీగా జన సమీకరణకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అయితే ఆర్టీసీ సమ్మె ప్రభావం దానిపై పడవచ్చనే వాదన సైతం లేకపోలేదు. సభకు వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 50 వేల మంది వస్తారన్నది ఓ అంచనా.

ALSO READ: ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌ గౌడ్ మృతి.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, బాధిత కుటుంబానికి ప్రభుత్వ భరోసా

తెలంగాణ ప్రజా జాగృతి పార్టీకి ధర్మగంట గుర్తులు కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని కవిత ఇప్పటికే కోరినట్లు తెలుస్తోంది. పార్టీ రిజిస్ట్రేషన్ డిలే కావడంతో గతంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కవిత.త్వరగా ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతులు ఇప్పించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది ఢిల్లీ హైకోర్టు.

శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం ఆన్‌లైన్ పోర్టల్‌లో అధికారికంగా కవిత పార్టీ పేరు, గుర్తును చేయనుంది. మరోవైపు కవిత పార్టీ, సభకు బీఆర్ఎస్ నేతల్లో చర్చ మొదలైంది. ఎవరైనా కవిత పార్టీలోకి వెళ్తున్నారా? అనేదానిపై ఆరా తీస్తున్నారు బీఆర్ఎస్ వేగులు. బీఆర్ఎస్‌కు చెందిన కొందరు నేతలు వెళ్లాలని భావించినప్పటికీ ఎన్నికలు ఇప్పట్లో లేకపోవడం దీనికి కారణంగా తెలుస్తోంది. మొత్తానికి కవిత కొత్తపార్టీ బీఆర్ఎస్ ఓ కన్నేసిందనే చెప్పవచ్చు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×