E-Paper
Advertisement

తెలంగాణ నీటి హక్కులు తాకట్టు పెడతారా? సీఎం రేవంత్‌ను నిలదీసిన కవిత!

తెలంగాణ నీటి హక్కులు తాకట్టు పెడతారా? సీఎం రేవంత్‌ను నిలదీసిన కవిత!
Advertisement

Kalvakuntla Kavitha: ఏపీ తలపెట్టిన పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై పటిష్టమైన పిటిషన్ సుప్రీం కోర్టులో దాఖలు చేయాలని తెలంగాణ రాష్ట్రసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా ఆ ప్రాజెక్టును అడ్డుకోవాలని సీఎం రేవంత్ కు విజ్ఞప్తి చేశారు. పోలవరం – బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ లో లోపాలున్నాయని సుప్రీంకోర్టు పేర్కొన్న నేపథ్యంలో సోమవారం ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. గోదావరిలో తెలంగాణ నీటి హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు తెరచాటుగా ఏపీకి సహకరిస్తున్నారని కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ చేస్తున్న ద్రోహాన్ని తెలంగాణ సమాజం క్షమించదన్నారు. గోదావరి లో తెలంగాణ నీటి హక్కులను ఫణంగా పెట్టి ఏపీకి తెరచాటుగా సహకరిస్తున్నారని విమర్శించారు. తమ నీటి హక్కులకు నష్టం చేసే పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు ఏపీకి సహకరిస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

ఏపీ అక్రమ ప్రాజెక్టుపై తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ లో లోపాలు ఉన్నాయని చెప్తూ ఏపీ ప్రభుత్వానికి కనీసం నోటీసులు ఇవ్వటానికి సుప్రీంకోర్టు నిరాకరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సున్నం పెట్టి.. ఏపీ సీఎం చంద్రబాబుకు గోదావరి నీళ్లను కట్టబెడుతున్నారని మండిపడ్డారు. బనకచర్ల విషయంలో ఏపీకి ఎంతగా సహకరిస్తున్నారో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు.

Also Read: వీఐ ధమాకా ప్లాన్.. 3,500 GB డేటా, 20+ OTTలు ఫ్రీ.. మూవీ లవర్స్‌కు పండగే!

Advertisement

తెలంగాణ ప్రాంత హక్కులను కాపాడాల్సింది పోయి ద్రోహం చేయటం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనికి తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు. ఈ ప్రభుత్వానికి నీళ్ల సోయి లేకపోవడం తెలంగాణకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీతో ముఖ్యమంత్రితో మిలాఖత్ రాజకీయాలు మాని తెలంగాణకు హక్కుల కోసం కాంగ్రెస్ పనిచేయాలని సూచించారు. ఏపీ తలపెట్టిన పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై పటిష్టమైన పిటిషన్ ను సుప్రీం కోర్టులో దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాజెక్టును అడ్డుకోకపోతే తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం చేసిన వారవుతారని హెచ్చరించారు.

Also Read: సింగరేణిని ‘ATM’లా వాడి.. రూ.50 వేల కోట్ల బాకీ పెట్టారు.. కాంగ్రెస్, BRSలపై కిషన్ రెడ్డి ఫైర్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×