E-Paper
Advertisement

టీఆర్ఎస్ జెండా పండుగకు గ్రీన్ సిగ్నల్.. మోడల్ ఆవిష్కరించిన కవిత!

టీఆర్ఎస్ జెండా పండుగకు గ్రీన్ సిగ్నల్.. మోడల్ ఆవిష్కరించిన కవిత!
Advertisement

Kavitha: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇకపై రాష్ట్రంల్లో ఒకే రకమైన, ఏకరూప (యూనిఫాం) మోడల్‌లో పార్టీ జెండా గద్దెలను నిర్మించబోతున్నట్లు టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌ లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర జనరల్ బాడీ సమావేశంలో ఆమె జెండా గద్దెల అధికారిక మోడల్‌ను స్వయంగా ఆవిష్కరించారు.

జెండా గద్దె కొలతలు.. రంగుల వివరాలు

Advertisement

పార్టీ శ్రేణులు నిర్మించాల్సిన జెండా గద్దెలను సంబంధించి కవిత స్పష్టమైన డిజైన్, కొలతలను ప్రకటించారు. ఈ గద్దెలు మెుత్తం మూడు ఫీట్ల ఎత్తు, రెండు ఫీట్ల వెడల్పుతో ఉండాలి. ఇందులో  ఒక ఫీట్ ఎత్తు గల కింది బేస్ భాగానికి గ్రీన్ కలర్ వేసి, దాని మధ్యలో తెలుగు అక్షరాలతో ‘ తెలంగాణ రక్షణ సేన’ అని రాయాల్సి ఉంటుంది. ఇక పైనున్న రెండు  ఫీట్ల భాగానికి ఎల్లో కలర్ వేసి, దాని మధ్యలో బ్లూ కలర్ లో తెలంగాణ మ్యాప్‌ను ముద్రించాలి. ఆ మ్యాప్ లోపల ఇంగ్లీష్ అక్షరాల్లో‘ TRS’ అని స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేయాలని ఆమె సూచించారు.

నెల రోజుల పాటు జెండా పండుగ..

Advertisement

రాష్ట్రవ్యాప్తంగా పార్లీ జెండాలన్నీ ఒకే రకమైన కలర్ కోడ్‌తో ఏక రూపంలో ఉండేలా చూసుకోవాలని కవిత క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే మే 20 వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ‘ టీఆర్ఎస్ జెండా పండుగ’ ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఈ లోపు నిర్దేశిత మోడల్ ప్రకారం గద్దెల నిర్మాణాలు పూర్తి చేసి, ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆమె కోరారు.

Also Read: లోకేష్ పేరు ‘లవ్ కాష్’ అయితే బాగుంటుంది.. గుంటూరు నిరసనలో అంబటి సెటైర్లు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×