E-Paper
Advertisement

రెండేళ్లలో అధికారంలోకి వస్తాం.. ముందుంది ముసళ్ల పండగ.. సీఎం రేవంత్‌కు కవిత సవాల్!

రెండేళ్లలో అధికారంలోకి వస్తాం.. ముందుంది ముసళ్ల పండగ.. సీఎం రేవంత్‌కు కవిత సవాల్!
Advertisement

Kavitha Speech: తన పార్టీ ఆవిర్భావ సభలో అధికార కాంగ్రెస్ పార్టీపై సైతం కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. జగిత్యాల సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. పరోక్షంగా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ప్రజలు తమను ఎన్నుకోకుండా ప్రజలు తప్పు చేశారని కేసీఆర్ అంటున్నారని.. దీనిని ఏమాత్రం తాను అంగీకరించనని కవిత అన్నారు. మీకు అధికారం ఇవ్వలేదని.. ప్రస్తుతం జరుగుతున్న కర్కోట పాలనలో ప్రజలను అలాగే వదిలేస్తారా అంటూ నిలదీశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై ఘాటు విమర్శలను కవిత సంధించారు.

ప్రస్తుతం తెలంగాణలో కర్కోటకుడి పాలన నడుస్తోందని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి ఇంటి మీదకు వచ్చి ఇళ్లు కూలగొడుతుంటే అమ్మలాగా ఆదుకోవాల్సిన పాత కేసీఆర్ ఎక్కడ? అంటూ ప్రశ్నించారు. దీనిని కచ్చితంగా ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. తనను పార్టీ నుంచి బహిష్కరించినప్పుడు కూడా వెంటనే కొత్త పార్టీ ప్రకటన చేయలేదని గుర్తుచేశారు. కేసీఆర్ మారతారేమోనని చూశానన్నారు. కానీ ఇప్పటివరకూ ఎలాంటి ఫలితం రాలేదన్నారు. కాబట్టి ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోని అన్యాయాలను ఎండగడుతూ వచ్చే రెండేళ్లలో తామే ప్రధాన ప్రతిపక్షం అవుతామని కవిత స్పష్టం చేశారు.

Advertisement

సీఎం రేవంత్ రెడ్డిని కర్కోటకుడు అని ఎందుకు అంటున్నానో కూడా కవిత వివరించే ప్రయత్నం చేశారు. ‘మెున్న ఖమ్మంలోని వెలుగుమట్లలో అర్ధరాత్రి వెళ్లి ఇళ్లు కూలగొట్టారు. ఒక నిండు గర్భిణికి టెన్షన్ వల్ల అబార్షన్ అయ్యింది. అప్పుడు ఆ తండ్రి పడ్డ బాధను కళ్లారా చూశా. ఆ తండ్రి రోధన ఇంకా తన చెవిలో వినిపిస్తూనే ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న సీఎంను కర్కోటకుడు అనే అంటా. హిట్లర్ అనే అంటా. 2 నెలల చిన్నపాప కుమ్మెరలో చనిపోతే ఇప్పటి వరకూ కూడా కేసు పెట్టలేదు. హోమంత్రి కూడా ఆయనే. కేసు పెట్టేంత తీరిక కూడా లేదనుకుంటా’ అంటూ కవిత తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement

Also Read: Kavitha New Party: బీఆర్ఎస్ కోసం రక్తం చిందించా.. కేసీఆర్ మనిషి కాదు, మర మనిషి.. విరుచుకుపడ్డ కవిత!

రాష్ట్రంలోని రాక్షస కాంగ్రెస్ పాలనపై పిడికిలి బిగించి మరి కొట్లాడతామని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మిగతా పార్టీల కంటే ఎక్కువగా కొట్లాడతామని పేర్కొన్నారు. ఇప్పుడు తామే ప్రధాన ప్రతిపక్షం అవుతామని.. రెండేళ్ల తర్వాత తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అధర్మం, అవినీతి, బంధుప్రీతితో నిండిపోయాయని కాబ్టటి వాటిపై కొట్లాటకు ఈ వేదికగా శంఖం పూరిస్తున్నట్లు కవిత స్పష్టం చేశారు. తెలంగాణను ప్రధానంగా అవసరమైన 5 అంశాలను సాధించేలా తమ కొట్లాట సాగుతుందని.. రెండేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాక.. వాటిని స్వయంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తామని కవిత హామీ ఇచ్చారు.

Also Read: కేసీఆర్ ఉద్యమ రథ చక్రం విరిగింది.. ఆయన ఫ్యామిలీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా.. కవిత సంచలన వ్యాఖ్యలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×