E-Paper
Advertisement

Kalvakuntla Kavitha: కాంగ్రెస్ బడ్జెట్ ఒక ‘డీప్ ఫేక్’.. పాత బడ్జెట్‌నే కాపీ పేస్ట్ చేశారు.. క‌విత విమ‌ర్శ‌లు

Kalvakuntla Kavitha: కాంగ్రెస్ బడ్జెట్ ఒక ‘డీప్ ఫేక్’.. పాత బడ్జెట్‌నే కాపీ పేస్ట్ చేశారు.. క‌విత విమ‌ర్శ‌లు
Advertisement

Kalvakuntla Kavitha: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2026పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. ఈ బడ్జెట్ ప్రజలను ఏమాత్రం ఆకట్టుకునేలా లేదని, ఇది కేవలం ‘ఫేక్ బడ్జెట్’ అని అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ. 3,24,234 కోట్ల బడ్జెట్‌లో ప్రజా ఆమోదం పొందే అంశాలేవీ లేవని ఆమె విమర్శించారు. తెలంగాణ జాగృతి నిపుణుల బృందం అంచనా వేసిన విధంగానే బడ్జెట్ అంకెలు ఉన్నాయని, కానీ కేటాయింపుల్లో మాత్రం ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడ్డారు.

రాష్ట్ర జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్‌లో కేవలం 4 శాతం నిధులు మాత్రమే కేటాయించడంపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో బీసీల కోసం ఏటా రూ. 20,000 కోట్లు కేటాయిస్తామని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు కేవలం రూ. 12,511 కోట్లు మాత్రమే కేటాయించి బీసీలను వంచించారని దుయ్యబట్టారు. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, కార్పొరేషన్లు, షాపింగ్ కాంప్లెక్స్ వంటి హామీలు ఎక్కడా అమలు కాలేదని విమర్శించారు. గ్లోబలైజేషన్‌లో అంతరించిపోతున్న కులవృత్తులను ఆదుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదని, కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే వారి గురించి ఆలోచిస్తోందని పేర్కొన్నారు.

Advertisement

తెలంగాణ చరిత్రలో మొదటిసారిగా ఎస్టీ (గిరిజన), మైనారిటీ మంత్రులు లేకుండా మంత్రివర్గం కొనసాగడం దారుణమని కవిత అన్నారు. లంబాడాలు లేని మంత్రివర్గం గతంలో ఎప్పుడూ లేదని, కనీసం ఎస్టీలకు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం గిరిజనులను అవమానించడమేనని ఆమె పేర్కొన్నారు. గత రెండున్నరేళ్లుగా మైనారిటీలకు మంత్రి పదవి కోసం తాము పోరాటం చేస్తున్నామని, అజారుద్దీన్‌ను హడావుడిగా తీసుకువచ్చినప్పటికీ, ఎస్టీల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి గత బడ్జెట్‌లో రూ. 12,000 కోట్లు కేటాయిస్తే, ఇప్పుడు దాన్ని రూ. 5,500 కోట్లకు తగ్గించడం పేదలను మోసం చేయడమేనని కవిత విమర్శించారు. 22.5 లక్షల ఇళ్లు ఇస్తామని చెప్పి ఇంత తక్కువ నిధులు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. అలాగే, రైతు భరోసా, చేయూత పెన్షన్లు, గృహజ్యోతి, గ్యాస్ సబ్సిడీ వంటి పథకాలకు గత ఏడాది కేటాయించిన నిధులనే ఈసారి కూడా అక్షరం పొల్లుపోకుండా కాపీ పేస్ట్ చేశారని ఎద్దేవా చేశారు. ఇది విజన్ ఉన్న బడ్జెట్ కాదని, కేవలం రివిజన్ బడ్జెట్ అని ఆమె చురకలంటించారు.

Advertisement

నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కవిత తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణలో డిగ్రీ చేసిన ప్రతి నలుగురు యువకుల్లో ఒకరికి, ఇద్దరు యువతుల్లో ఒకరికి మాత్రమే ఉద్యోగం దక్కుతోందని అజీం ప్రేమ్ జీ యూనివర్సిటీ సర్వే చెబుతోందని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగులను మోసం చేశారని, అందుకే ఆయనకు ‘రాహుల్ ఫేక్’ అని నామకరణం చేస్తున్నామని ప్రకటించారు. స్కిల్ యూనివర్సిటీ వెబ్ సైట్‌లో 68,000 మంది ఎన్రోల్ అయ్యారని తప్పుడు సమాచారం ఇస్తున్నారని, వాస్తవానికి అక్కడ ఉన్నది కేవలం 920 మంది మాత్రమేనని ఆమె ఆధారాలతో సహా నిరూపించారు.

రాష్ట్ర అప్పుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర అప్పు రూ. 8,64,198 కోట్లకు చేరుకుందని, అంటే రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై రూ. 2.16 లక్షల అప్పు భారం పడిందని వివరించారు. ఒక్కో కుటుంబంపై దాదాపు రూ. 9 లక్షల అప్పును కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన పెట్టిందని మండిపడ్డారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ. 22,000 కోట్ల నిధులను రాబట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, కేవలం 50 శాతం నిధులు మాత్రమే సాధించగలిగిందని విమర్శించారు.

మహిళలను కోటీశ్వరులను చేస్తామంటున్న ప్రభుత్వం, ‘స్త్రీ నిధి’లో జరుగుతున్న అక్రమాలను పట్టించుకోవడం లేదని కవిత ఆరోపించారు. 14 ఏళ్లుగా ఎం‌డి‌గా కొనసాగుతున్న విద్యాసాగర్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని, సీతక్క గారు వెంటనే స్పందించి ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. సింగరేణి, జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1.5 లక్షల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. చివరగా, నిరుద్యోగులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడికి తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ఇస్తుందని కవిత స్పష్టం చేశారు.

Read Also: ఈగల్ టీమ్ దాడిలో బీఆర్ఎస్ నేతలు దొరికినా బీజేపీ ఎందుకు మాట్లాడదు? : మహేష్ కుమార్ గౌడ్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×