E-Paper
Advertisement

Kavitha: తెలంగాణ వచ్చి 12 ఏళ్లు అయినా.. అదే పరిస్థితి ఏం మారింది..? మేడారంలో కవిత సంచలన వ్యాఖ్యలు

Kavitha: తెలంగాణ వచ్చి 12 ఏళ్లు అయినా.. అదే పరిస్థితి ఏం మారింది..? మేడారంలో కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే మేడారం జాతరలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వనదేవతలు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. దేవతలకు మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆ తల్లులను వేడుకున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి మేడారం జాతర ఒక నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

వీరవనితల స్ఫూర్తితో ముందుకు

చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేస్తూ, సమ్మక్క-సారలమ్మలు కేవలం దేవతలు మాత్రమే కాదని, అన్యాయంపై ఎదిరించిన వీరవనితలని కవిత కొనియాడారు. ‘నాడు శక్తివంతమైన కాకతీయ రాజులతో తమ జాతి హక్కుల కోసం, అడవి బిడ్డల సంక్షేమం కోసం పోరాడిన ధీర వనితలు వీరు. గోవింద రాజు, పడిగిద్ద రాజుల వంశంలో జన్మించిన వీరు గొప్ప సైనికులుగా పోరాట పటిమను చాటారు’ అని ఆమె ప్రశంసించారు. వారి పోరాట స్ఫూర్తిని స్వీకరించి, భవిష్యత్తులో తెలంగాణ ప్రజల గొంతుకగా నిలుస్తామని ఆమె స్పష్టం చేశారు.

12 ఏళ్ల తెలంగాణ – నెరవేరని కలలు

Advertisement

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా, ఉద్యమ ఆకాంక్షలు ఇంకా పూర్తిస్థాయిలో నెరవేరలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ నేటికీ అనేక ప్రాంతాల్లో నీళ్లు అందక, యువతకు నియామకాలు లేక, నిధుల వినియోగంలో అస్తవ్యస్తత నెలకొంది’ అని విమర్శించారు. స్వరాష్ట్రంలో కూడా ప్రజలు తమ ప్రాథమిక హక్కుల కోసం ఎదురుచూడాల్సి రావడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు.

సామాజిక న్యాయం కోసం జాగృతి కృషి

సమాజంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందడం లేదని, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం మరింత కృషి జరగాలని ఆమె అభిప్రాయపడ్డారు. తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా ప్రజల్లో చైతన్యం నింపుతూ, అన్యాయం జరిగిన చోట బాధితుల పక్షాన పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. వనదేవతల ఆశీస్సులతో తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా తమ ప్రయాణం కొనసాగుతుందని, సామాజిక న్యాయం చేకూరే వరకు విశ్రమించబోమని కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

Advertisement

ALSO READ: Medaram Jatara: మేడారం ఓ అద్భుతం.. వనదేవతలను దర్శించుకోండి.. జాతరలో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ సందడి

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×