E-Paper
Advertisement

Kavitha: కూల్చిన చోటే ఇళ్లు కట్టించి ఇవ్వాలి.. ఖమ్మం ఆందోళనలో కవిత సంచలన డిమాండ్

Kavitha: కూల్చిన చోటే ఇళ్లు కట్టించి ఇవ్వాలి.. ఖమ్మం ఆందోళనలో కవిత సంచలన డిమాండ్
Advertisement

ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలుగుమట్ల భూ నిర్వాసితుల పక్షాన తెలంగాణ జాగృతి పోరాటం ఉధృతం చేసింది. బాధితులకు న్యాయం జరిగే వరకు విశ్రమించేది లేదని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మంగళవారం నాడు తెలంగాణ జాగృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ నాయకులు సంయుక్తంగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బాధితుల గొంతుకగా నిలబడతామని భరోసా ఇచ్చారు.

వెలుగుమట్ల భూ బాధితుల సమస్యలను రాష్ట్రస్థాయిలో బలంగా వినిపించామని ఆమె పేర్కొన్నారు. గతంలో ఏ రాజకీయ పార్టీ లేదా స్వచ్ఛంద సంస్థ కూడా ఈ స్థాయిలో బాధితుల పక్షాన నిలబడలేదని గుర్తుచేశారు. నిర్వాసితుల ఆకాంక్షలు నెరవేరే వరకు తమ పోరాటం వివిధ రూపాల్లో కొనసాగుతుందని హెచ్చరించారు. బాధితుల ఇళ్లను ఎక్కడైతే కూల్చివేశారో.. సరిగ్గా అదే ప్రాంతంలో ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

ప్రభుత్వ వాదనలను తప్పుబడుతూ ఆ భూమి ప్రభుత్వానిది కాదని కవిత తేల్చిచెప్పారు. అది కేవలం భూదాన్ భూమి మాత్రమేనని.. ఆ భూములపై పేదలకు పూర్తి హక్కు ఉంటుందని వివరించారు. భూదాన్ సిద్ధాంతం ప్రకారం ఆ స్థలాలు పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అక్రమంగా ఇళ్లు కూల్చివేసి పేదలను రోడ్డున పడేయడం అమానుషమని మండిపడ్డారు.

న్యాయం లభించే వరకు నిర్వాసితులకు అండగా ఉంటామని కవిత హామీ ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు పునరావాసం కల్పించాలని కోరారు. ఈ ఆందోళనలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వానికి తెలిసేలా పోరాడతామని వారు ప్రతిన పూనారు.

Advertisement

ALSO READ: CM Revanth Reddy: పోలీసులు అప్‌గ్రేడ్ కావాలి.. కొత్త తరహా నేరాలను ఎదుర్కోవడమే అతిపెద్ద సవాలు: సీఎం రేవంత్ రెడ్డి

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×