E-Paper
Advertisement

కాంగ్రెస్ సర్కార్ పై కవిత అల్టిమేటం.. జూన్ 2 వరకే మీకు టైం టంటూ ఫైర్..!

కాంగ్రెస్ సర్కార్ పై కవిత అల్టిమేటం.. జూన్ 2 వరకే మీకు టైం టంటూ ఫైర్..!
Advertisement

Kavitha: స్వేచ్చ బ్యూరో: హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి జూన్ 2 వరకు గడువు ఇస్తున్నామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ – తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల సంఘాలతో సమావేశం అయ్యారు. తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.

హామీల అమలు కోసం..

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలకు జూన్ 2 వరకు గడువు ఇస్తున్నామని అప్పటికీ హామీలు అమలు చేయకుంటే ఉద్యమకారులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. జార్ఖండ్ ప్రభుత్వం ఉద్యమకారులకు అందిస్తున్న సంక్షేమ పథకాల తరహాలో తెలంగాణలో ఉద్యమకారులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు భువనగిరి జిల్లా కేంద్రంలో సభ నిర్వహించాలని, భూపోరాటాలు ఉధృతం చేయాలని, జిల్లాల వారీగా ఉద్యమకారులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

Advertisement

Also read: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన.. పవన్ కళ్యాణ్ కు పరామర్శ.. చంద్రబాబుతో భేటీ!

ఉద్యమకారులతో కలిసి..

సమావేశం అనంతరం ఉద్యమకారులతో కలిసి కల్వకుంట్ల కవిత సహపంక్తి భోజనం చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు రూప్ సింగ్, సయ్యద్ ఇస్మాయిల్, మలి దశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సామ అంజిరెడ్డి, ఉపాధ్యక్షుడు మూల ప్రభాకర్ గౌడ్, కార్యదర్శులు వెలమల రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ అధ్యక్షులు బోగి పద్మ, నాయకులు గుస్సా రవీందర్, అరుణ, తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు పూస శ్రీనివాస్, కొడిమల కృష్ణ, డీఎస్ మాణిక్యమ్మ, తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు రామగిరి ప్రకాశ్, ఉపాధ్యక్షులు బీరకాయల మధుసూదన్, భరత్ రెడ్డి, తొలి దశ ఉద్యమకారుల సంఘం ఉపాధ్యక్షులు సాజిద సికిందర్, శ్రీవల్లి, తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also read: ఆ సమయంలో నరకం చూశాను.. ఎమోషనల్ అయిన నటి కియారా ?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×