E-Paper
Advertisement

Kavitha : కవిత.. మరో జయలలిత?

Kavitha : కవిత.. మరో జయలలిత?
Advertisement

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరుకుంటున్న పొలిటికల్ అటెన్షన్‌పై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అసలు కవిత ఎందుకు సొంత పార్టీ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఏ కుటుంబంలో అయినా గొడవలు కామన్. మరల తిరిగి కారు పార్టీలోకి వెళ్లాలని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం కవిత నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.ప్రతిభకు గుర్తింపు, గౌరవ మర్యాదలు, వ్యక్తిత్వం మీద దాడులు జరుగుతుంటే ఎవరైనా ఎన్నాళ్లూ ఓపిక పడతారని పలువురు చర్చించుకుంటున్నారు.ఏదైనా సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కారు పార్టీలో లేకపోవడం, తన ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్స్ ట్యాపింగ్‌తో ఆమె మనసు విరిగిందని, అటువంటప్పుడు ఒంటరి పోరాటమే బెటర్ అని పలువురు మద్దతుగా నిలుస్తున్నారు.

కేసీఆర్ తప్పు చేశారా?

కుటుంబం అన్నాక గొడవలు కామన్. చిన్న కుటుంబాల్లోనే డబ్బులు, మనస్పర్దలు, భేదాభిప్రాయాలు వస్తుంటాయి. అటువంటప్పుడు ఇంటి పెద్ద కూర్చొని మాట్లాడి వాటిని సెట్ రైట్ చేస్తుంటారు. కానీ, కవిత విషయంలో మాత్రం ఆమె మీడియా ముందు కంటతడి పెట్టి తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించినా, రోదించినా బీఆర్ఎస్ నుంచి కనీసం ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. చివరకు కేసీఆర్ సైతం ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఆమె పార్టీకి రాజీనామా చేసిన సమయంలోనూ పిలిపించుకుని మాట్లాడలేదు. దీంతో తీవ్రంగా హర్ట్ అయిన కవిత.. అటు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూనే సొంత పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఒకవేళ కేసీఆర్ బయటకు వచ్చి ఎన్నికల సమయం వరకు కవితను పిలిచే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.

మరో జయలలిత అవుతారా?

Advertisement

కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టాలని మెంటల్‌గా డిసైడ్ అయినట్టు తెలుస్తున్నది. మే నెలలో పార్టీ ప్రకటన ఉంటుందని ఇప్పటికే ప్రకటించింది.పార్టీ పేరులో ‘తెలంగాణ’ అనే పదం తప్పక ఉంటుందని హింట్ సైతం ఇచ్చింది. ప్రస్తుతం ఈ మేరకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. జాగృతి నేతలతో 20 కమిటీలవు వేసిన కవిత.. నివేదికలు సైతం తెచ్చుకున్నారు. ఈ మేరకు పార్టీ ప్రకటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం విరుచుకపడే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై కవిత విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

CM Revanth Reddy: కాలేజీల అమ్మాయిలకు ఈవీ స్కూటీలు.. అంతర్జాతీయ మహిళ ఈవెంట్ లో సీఎం రేవంత్

Advertisement

అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు, అవినీతి, అక్రమాలపై నిలదీసి ఆ రెండు పార్టీలకు చుక్కలు చూపించనున్నారని తెలుస్తున్నతి. ఈవిధంగా ప్రతిపక్ష పోషిస్తూ జనం మధ్యలో ఉండి ప్రతిభా వంతులరాలైన నాయకురాలిగా పేరు తెచ్చుకోవాలని ఆమె చూస్తున్నట్టు సమాచారం. తమిళనాడులో దివంగత జయలలిత రాజకీయాన్ని కవిత స్ఫూర్తిగా తీసుకున్నారని, ఆమె ఎటువంటి రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చిందో అలాగే తాను సైతం సీఎం అవ్వాలని, అందుకు తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్నట్టు తెలుస్తున్నది. కవిత దూకుడు చూస్తుంటే ఆమె అనుకున్నవిధంగానే కొత్త పార్టీని స్థాపించి, అధికారంలోకి నిజంగానే వస్తుందా? అని పలువురు చర్చించకుంటున్నారు. మరికొందరైతే కవిత, జయలలితను బీట్ చేయలేదని, ఆమెలా పాలిటిక్స్ చేస్తే ఇతర పార్టీకి షాక్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×