E-Paper
Advertisement

కేసీఆర్ ఉద్యమ రథ చక్రం విరిగింది.. ఆయన ఫ్యామిలీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా.. కవిత సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ ఉద్యమ రథ చక్రం విరిగింది.. ఆయన ఫ్యామిలీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా.. కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement

Kavitha Party:  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన కొత్త పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. పార్టీకి టీఆర్ఎస్ (TRS) పేరు పెట్టినట్లు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ సభలో కవిత మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (టీఆర్ఎస్) పేరుతో తెలంగాణ గడ్డపై సరికొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో తెలంగాణకు కాబోయే సీఎం అంటూ పార్టీ శ్రేణులు తమ నినాదాలతో సభను హోరెత్తించారు. కాగా, తన తండ్రి స్థాపించిన బీఆర్ఎస్ పార్టీకి ఒకప్పటి పేరుగా ఉన్న టీఆర్ఎస్ ను కవిత తన కొత్త పార్టీకి కలిసివచ్చేలా పెట్టడం తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి.

Advertisement

కొత్త పార్టీ ప్రకటన అనంతరం కవిత మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో భాగమైనందుకు కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సామాజిక రథ చక్రం విరిగి ముక్కలైందంటూ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ వస్తే బానిస సంకెళ్లు పోతాయని అనుకున్నాం కానీ రైతులకు సంకెళ్లు పడ్డాయని, దళితులకు దెబ్బలు పడ్డాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సభలో ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సైతం కవిత లేవనెత్తారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఈ ట్యాపింగ్ వల్ల వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా పోయిందని.. దారుణమైన నిఘా నీడలో బతకాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు.

Advertisement

సామాజిక న్యాయ తెలంగాణ కోసమే.. తన కొత్త ‘టీఆర్ఎస్’ పార్టీ ప్రజల ముందుకు వచ్చిందని కవిత స్పష్టం చేశారు. పోరాటాలతో మాత్రమే ప్రజలకు మంచి చేయమలేమన్న కవిత.. రాజకీయ అధికారం కూడా ఇందుకు తోడవ్వాలని అభిప్రాయపడ్డారు. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ స్థాపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రేపటి నుంచి తమ పనితీరు ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలు చూస్తారని కవిత వ్యాఖ్యానించారు. గత 11 నెలలుగా తెలంగాణ జాగృతి చేస్తున్న పోరాటాలను రాష్ట్ర ప్రజలు చూస్తూనే వస్తున్నారని కవిత అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో చాలా వరకూ సక్సెస్ కూడా సాధించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. అయితే పోరాటాలు చేస్తే సరిపోదని.. అందుకే పార్టీ స్థాపిస్తున్నట్లు ఆమె పునరుద్ఘటించారు.

తెలంగాణలోని మూడున్నర కోట్ల మంది ప్రజలకు అమ్మగా పరిణితి చెందాలని తాను కోరుకుంటున్నట్లు కవిత వ్యాఖ్యానించారు. బిడ్డలకు కష్టాలు వస్తే అమ్మ హృదయం బద్దలవుతుందని.. అమ్మతనంతో పరిపాలన జరిగినప్పుడే ప్రజల కష్టాలు తీరతాయని ఆమె అభిప్రాయపడ్డారు. అదే సమయంలో రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోవడం వల్లే.. తెలంగాణ రాష్ట్ర సేన వచ్చిందని కవిత స్పష్టం చేశారు.

Also Read: Nindu Noorella Saavasam Serial Today Episode April 25th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: యాదమ్మను పంపిచేయమన్న అమర్    

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×