E-Paper
Advertisement

karimnagar: బాలికలకు భరోసాగా స్నేహిత.. కరీంనగర్ కలెక్టర్ గొప్ప నిర్ణయం

karimnagar: బాలికలకు భరోసాగా స్నేహిత.. కరీంనగర్ కలెక్టర్ గొప్ప నిర్ణయం
Advertisement

karimnagar: ప్రభుత్వ పాఠశాల లలో చదువుతున్న బాలికలకు ధైర్యం, భరొసా నింపేందుకు స్నేహిత కార్యక్రమం చేపట్టారు కరీంనగర్ జిల్లా కలెక్టర్. స్నేహిత కార్యక్రమం ద్వారా బాలికలు,మహిళలకు ఆరోగ్యం, భద్రత ముఖ్యంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముందడుగు వేసారు.

కరీంనగర్ జిల్లా లో మహిళ అరోగ్యం, మహిళల, బాలికల భద్రతపై‌ ప్రత్యేక దృష్టి పెట్టారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఇప్పటికే శుక్రవారం సభ పెట్టి మహిళల‌ అరోగ్యం‌పై దృష్టి పెట్టిన కలెక్టర్ ఇప్పుడు ఇటీవల ప్రభుత్వ పాఠశాలలలో జరిగిన సంఘటనతో బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి పాఠశాలలో బాలికల భరోసా కల్పించేదుకు స్నేహిత కార్యక్రమం రూపోందించారు. మహిళల అభివృద్ధి, శిశు సంక్షేమ ఆధ్వర్యంలో బాలికలకు స్నేహిత కార్యక్రమం పై అవగాహాన కల్పించారు.

Advertisement

స్నేహిత అనేది బాలికల కోసం రూపొందించిన భరోసా వేదిక. ప్రతి పాఠశాలలో ఫిర్యాదు పెట్టెను ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు ఎదుర్కొనే వేధింపులు, భయాలు, పాఠశాల పరిధిలో ఉన్న ఏవైనా సమస్యలను ధైర్యంగా రాసి ఆ పెట్టెలో వేయవచ్చు. ఆ ఫిర్యాదు పెట్టెల తాళాలు షీ టీమ్‌లు, నోడల్ అధికారుల వద్ద ఉంటాయి. ఈ విధంగా విద్యార్థుల ఫిర్యాదులు గోప్యంగా సేకరించబడతాయి. అవసరమైతే వెంటనే చర్యలు తీసుకుంటారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. బాలికల భద్రత అంటే కేవలం పోలీసు, ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, కుటుంబం, సమాజం, విద్యా వ్యవస్థ కూడా సమానంగా బాధ్యత వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు.

Advertisement

Also Read: వేములవాడ రాజన్న దర్శనాలు నిలిపివేత.. భక్తుల ఆగ్రహం

అలాగే, ఎవరైనా బాలికలను వేధించినా, అసభ్యకరంగా ప్రవర్తించినా వెంటనే డయల్ 100, టోల్ ఫ్రీ నంబర్ 1058కు ఫిర్యాదు చేయాలని, పోలీసులు తక్షణమే స్పందిస్తారని వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, మానసిక స్థితిపై దృష్టి పెట్టాలని, పాఠశాలల్లో భద్రతా వాతావరణం సృష్టించడం అందరి కర్తవ్యమని కలెక్టర్ అన్నారు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×