// // Karimnagar: కుప్పకూలిన మానేరు చెక్ డ్యామ్.. కొట్టుకుపోయిందా? కూలగొట్టారా..? -->
E-Paper
Advertisement

Karimnagar: కుప్పకూలిన మానేరు చెక్ డ్యామ్.. కొట్టుకుపోయిందా? కూలగొట్టారా..?

Karimnagar: కుప్పకూలిన మానేరు చెక్ డ్యామ్.. కొట్టుకుపోయిందా? కూలగొట్టారా..?
Advertisement

Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు వాగుపై చెక్‌డ్యాంలు వరుసగా కూలిపోవడాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నవంబర్‌ 21న పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల రెండు గ్రామాల శివారు మధ్య మానేరు నదిపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ కూలిపోగా.. తాజాగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్‌పల్లి మానేరుపై నిర్మించిన చెక్‌డ్యాం కొట్టుకుపోవడం చర్చనీయాంశంగా మారింది.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మానేరుపై ఈ చెక్‌డ్యాం నిర్మించగా నిన్న తెల్లవారుజాముు సుమారు 120 మీటర్ల మేర ధ్వంసమైంది. అయితే ఈ డ్యామ్.. వరద ఉధృతికి కొట్టుకుపోయిందా? ఎవరైనా కావాలనే కూలగొట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్యాం కూలిపోయిందన్న సమాచారంతో అడవి సోమన్‌పల్లికి చెందిన రైతులు.. చెక్‌డ్యాంను పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి ఉంటారని భావిస్తున్నామన్నారు అన్నదాతలు. భారీ వరదలు వచ్చినప్పుడు కూడా చెక్‌ డ్యాం పటిష్టంగా ఉందని.. కానీ ప్రస్తుతం వరదలేవి లేని సమయంలో ఇలా కూలడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అయితే కొద్దిరోజుల క్రితం చెక్‌డ్యాం వద్ద పెద్దబుంగపడిందని స్థానికులు చెబుతున్నారు. ప్రతీరోజు చేపలు పట్టేందుకు కొందరు అక్కడకు వెళ్తుంటారని, అక్కడక్కడా పగుళ్లతోపాటు బుంగ కూడా కనిపించిందని స్థానికులు తెలిపారు. చెక్‌డ్యాం కొట్టుకుపోయిందన్న సమాచారం మేరకు ఇరిగేషన్‌ ఏఈ నిఖిల్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద తాకిడితో కొట్టుకుపోయిందా? లేక ఎవరైనా కూలగొట్టారా? అనే కోణంలో పరిశీలన చేశారు. అక్కడి పరిస్థితులు అనుమానాస్పదంగా ఉన్నాయని, వరద తాకిడితో కొట్టుకుపోయినట్లు కనిపించడం లేదని ఏఈఈ తెలిపారు.

Also Read: హైదరాబాద్‌లో భారీ రియల్ మోసం.. కస్టమర్లను నిలువునా ముంచిన మైరాన్ సంస్థ..

Advertisement

2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం 39.82 కోట్ల వ్యయంతో ఈ చెక్‌డ్యాంను నిర్మించింది. 130.78 క్యూసెక్కుల నీటికి అనుగుణంగా నిర్మించారు. అయితే 2023లో 131.400 క్యూసెక్కుల నీటి ప్రవాహానికి చెక్‌ డ్యాం ఎడమ వైపు రిటైనింగ్ వాల్, కట్‌ ఆఫ్ వాల్‌ దెబ్బతిన్నది. దీనికి అప్పట్లో నీటిపారుదల శాఖ అధికారులు మరమ్మతులు చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×