// // Kalvakuntla Kavitha - హరీశ్​రావు ఓ గుంట నక్క.. కవిత సెటైర్‌ -->
E-Paper
Advertisement

Kalvakuntla Kavitha: హరీశ్​రావు ఓ గుంట నక్క.. కవిత సెటైర్‌

Kalvakuntla Kavitha: హరీశ్​రావు ఓ గుంట నక్క.. కవిత సెటైర్‌
Advertisement

Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తాజాగా.. మాజీ మంత్రి హరీశ్​రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనను గుంట నక్క అని హాట్ కామెంట్స్ చేశారు.

జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా సూర్యాపేటలో కల్వకుంట కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

Advertisement

బీఆర్​ఎస్​ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. దీనిపై కవిత స్పందించారు. గుంటనక్క హరీశ్​రావును సీఎం రేవంత్​రెడ్డి వ్యక్తిగతంగా ఒక్క మాట అన్నందుకు సభను బహిష్కరించారని అన్నారు.

హరీష్ రావును తిడితే సభను వాయిదా వేసుకొని వెళ్లిపోవటం బీఆర్ఎస్ డ్రామా కాదా? అంటూ కవిత ప్రశ్నించారు. బీఆర్ఎస్ బాయ్ కాట్ హరీష్ రావు నిర్ణయమా? బీఆర్ఎస్ పెద్దల నిర్ణయమా? అంటూ కవిత నిలదీశారు. అది కేసీఆర్, కేటీఆర్ నిర్ణయమైతే చరిత్రలో క్షమించరాని తప్పు చేసినట్లే అని వ్యాాఖ్యానించారు.

Advertisement

అసెంబ్లీ మాట్లాడే అవకాశం వదిలి.. బయట సభలు పెట్టి ప్రజలకు వివరిస్తారా? అంటూ బీఆర్ఎస్ నేతల తీరుపై కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు 3 శాతం నీళ్ల వాటా తగ్గించే ఒప్పందంపై హరీష్ రావు సంతకం చేశారా? లేదా? అన్న విషయంపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

మరోవైపు పాలమూరు-రంగారెడ్డి విషయంలో అసెంబ్లీలో.. ప్రభుత్వం అడ్డగోలు అబద్దాలు చెబుతోందని కవిత తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆల్మట్టి ఎత్తు పెంపు, అప్పర్ భద్రకు జాతీయ హోదాను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయాలి అంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే కృష్ణా నది నీళ్ల అంశంపై చర్చించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలమూరు-రంగారెడ్డి, నారాయణ్ పేట్ -కొడంగల్ కు 77.5 టీఎంసీలు కేటాయిస్తే 40 టీఎంసీలకే ఎందుకు అంగీకరించారు. అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత నిలదీశారు.

పాలమూరు ప్రజలకు రేవంత్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని ప్రజలు క్షమించరు అంటూ కవిత ఆరోపించారు. జూరాల నుంచి శ్రీశైలంకు ఇన్ టేక్ పాయింట్‌ను ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలి? అని కవిత కోరారు. అదే సమయంలో సూర్యాపేటలో జగదీష్ రెడ్డి అనుచరులు గుడులను, చెరువులను కూడా వదలకుండా దోచుకున్నారంటూ కవిత కవిత ఆరోపించారు.

Also Read: సీఎం రేవంత్ రాబందులా మారారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

హరీష్ రావు, జగదీష్ రెడ్డిపై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు. అడ్డగోలుగా అవినీతి చేసిన వారిపై నేను మాట్లాడుతూనే ఉంటానని కవిత స్పష్టం చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×