E-Paper
Advertisement

కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. 2000 కార్లతో భారీ ర్యాలీ..!

కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. 2000 కార్లతో భారీ ర్యాలీ..!
Advertisement

Kalvakuntla Kavitha: స్వేచ్చ బ్యూరో: మేడ్చల్ జిల్లాలోని జీహెచ్ఎంసీ పరిధి మునీరాబాద్ గ్రామంలోని అద్వయ కన్వెన్షన్ హాల్‌లో ఈ నెల 25న కవిత కొత్త రాజకీయ పార్టీ ఆవిష్కరణ సభ ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా వరంగల్ కాకతీయ తోరణం ఆకృతిలో ప్రధాన ప్రవేశ ద్వారం ఏర్పాటు చేస్తున్నారు. సభ ప్రాంగణంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు ప్రముఖ మహనీయులైన బి ఆర్ అంబేడ్కర్, జ్యోతి రావు పూలే, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

2000 కార్లతో ర్యాలీ..

ఉదయం 8 గంటలకు సభ ప్రారంభం కానుండగా, 10 గంటలకు పార్టీ పేరు, జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగనుంది. సభకు ముందు కవిత అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి, అనంతరం సభ ప్రాంగణానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత సుమారు 2000 కార్లతో బంజారాహిల్స్ వైపు భారీ ర్యాలీగా బయలుదేరి, వివిధ నియోజకవర్గాలు మరియు ఓల్డ్ సిటీ మీదుగా పార్టీ జెండా ఆవిష్కరణలు నిర్వహిస్తూ పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఈ కార్యక్రమానికి 40 నుంచి 50 వేల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా 60 వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు.

Advertisement

Also Read: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సిత్రాలు.. హుగ్లీ నదిలో ప్రధాని మోదీ ప్రయాణం, లాహిరి లాహిరి లాహిరిలో

50 ఎకరాల పార్కింగ్ ప్లేస్..

అద్వయ కన్వెన్షన్ హాల్‌లో సుమారు 20 వేల మందికి సామర్థ్యం ఉండగా, హాల్ చుట్టూ 18 ఎకరాల విస్తీర్ణంలో విస్తృత సదుపాయాలు కల్పించారు. అదనంగా, వృద్ధులు మరియు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్‌చైర్ సదుపాయం కల్పించడంతో పాటు, వారికి సులభంగా రాకపోకలు సాగేందుకు ప్రత్యేక మార్గాలు, సహాయక సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చే వాహనాల కోసం 50 ఎకరాల పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. సభలో పాల్గొనే వారికి స్పష్టమైన వీక్షణ కోసం 35 భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

Also Read: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?R

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×