// // 'ఎగ్జామ్ లేకుండానే సీట్లు ఇవ్వాలి'.. కవిత సంచలన డిమాండ్ -->
E-Paper
Advertisement

ఎగ్జామ్ లేకుండానే సీట్లు ఇవ్వాలి.. లేదంటే ఉద్యమిస్తాం.. కవిత సంచలన డిమాండ్

ఎగ్జామ్ లేకుండానే సీట్లు ఇవ్వాలి.. లేదంటే ఉద్యమిస్తాం.. కవిత సంచలన డిమాండ్
Advertisement

Kalvakuntla Kavitha: ఎస్సీ ఉప కులాల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. సోమవారం బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఎస్సీ 57 ఉప కులాల నాయకులతో ఆమె సమావేశమయ్యారు. ఎస్సీల్లో 57 ఉప కులాలు ఉంటే అందులో 47 కులాలకు ఆర్డీవోలు క్యాస్ట్ సర్టిఫికెట్లు జారీ చేయడం అత్యంత విచారకరమన్నారు. అన్ని కులాలకు తహశీల్దార్ లే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు.

సమాజంలో అత్యంత వెనుకబడిన ఎస్సీ ఉప కులాల్లోని విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా గురుకులాల్లో సీట్లు కేటాయించాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధుల్లోనూ ఉప కులాలకు ప్రత్యేక వాటా ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. ఎస్సీ ఉప కులాల్లోని కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పెన్షన్ లు ఇవ్వాలని కోరారు.

Advertisement

మరోవైపు గచ్చిబౌలిలోని లిడ్ క్యాప్ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం బడాబాబులకు కట్టబెట్టాలని చూస్తోందని కవిత ఆరోపించారు. ఆ భూములను తాము రక్షిస్తామన్నారు. జిల్లాల్లోని లిడ్ క్యాప్ భూములు రక్షించేందుకు అవసరమైతే ఉద్యమిస్తామన్నారు. అటు గ్రామ దేవతల ఆలయాల్లో దళిత పూజారులకు అవకాశం ఇవ్వాలని, గ్రామ దేవతల ఆలయాలకు ధూపదీప నైవేథ్యాల కోసం ప్రోత్సాహకాలు అందజేయాలన్నారు.

Advertisement

Also Read: ఓరేయ్ పాపిష్టోడా.. ఇదేం పనిరా.. పిల్లనిచ్చిన అత్తను పెళ్లాడిన అల్లుడు!

అనేక ఉప కులాల పేర్లు తప్పుగా గెజిట్ లో పేర్కొన్నారని కవిత ఆరోపించారు. వాటిని సవరించే వరకు ప్రభుత్వం వెంట పడతామని హెచ్చరించారు. ఎస్సీ ఉప కులాల హక్కుల సాధన కోసం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఆందోళన చేస్తామని తెలిపారు. కాగా సమావేశంలో ఎస్సీ 57 ఉప కులాల ఐక్య వేదిక అధ్యక్షుడు చింతల రాజలింగం, టీఆర్ఎస్ నాయకులు, 57 ఉప కులాల నాయకులు పాల్గొన్నారు.

Also Read: పెళ్లికి ముందు శారీరక బంధం పెట్టుకుంటే.. మంచోడు కాదని చెప్పలేం.. సుప్రీంకోర్టు సంచలనం

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×