E-Paper
Advertisement

బీజేపీ మహిళలను మోసం చేస్తోంది.. జనగణనలో బీసీ లెక్కలు తేలాలి: కల్వకుంట్ల కవిత

బీజేపీ మహిళలను మోసం చేస్తోంది.. జనగణనలో బీసీ లెక్కలు తేలాలి: కల్వకుంట్ల కవిత
Advertisement

Kalvakuntla Kavitha: మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఏకపక్షంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మహిళా కోటాకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో గురువారం ఆమె ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుదల చేశారు. ఈ బిల్లు అమలు ప్రక్రియలో ఓబీసీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో చేపట్టే జనగణనలో ఓబీసీల గణనను కచ్చితంగా చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.

బీసీ గణనతోనే మహిళలకు న్యాయం..

ప్రస్తుత జనగణనలో కులం కాలమ్ ఉన్నప్పటికీ ఓబీసీలకు సంబంధించిన స్పష్టమైన వర్గీకరణ లేదని కవిత పేర్కొన్నారు. దీనివల్ల దేశంలో బీసీల జనాభా ఎంతో కచ్చితమైన లెక్కలు తేలవని ఆమె వివరించారు. ఓబీసీలను లెక్కించకుండా మహిళా కోటా అమలు చేయడం వల్ల వెనుకబడిన వర్గాల మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించదని ఆమె ఆరోపించారు. ముందుగా ఓబీసీ గణన పూర్తి చేసి దానికి అనుగుణంగా మహిళా కోటాలో ఓబీసీలకు సబ్ కోటా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ చేస్తున్న ఈ అన్యాయంపై పోరాడటానికి బీసీ మహిళలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

డ్రాఫ్ట్ బిల్లుపై గోప్యత ఎందుకు?

Advertisement

మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగక ముందే డ్రాఫ్ట్ బిల్లును అన్ని రాజకీయ పార్టీలకు అందజేయాలని కవిత డిమాండ్ చేశారు. చర్చ జరిగే రోజు ఉదయం మాత్రమే బిల్లు పత్రాలను ఇస్తామని చెప్పడం కుట్రపూరిత చర్యగా ఆమె అభివర్ణించారు. సభ్యులకు బిల్లుపై అధ్యయనం చేసే సమయం ఇవ్వకపోవడం వల్ల అభ్యంతరాలు వ్యక్తపరిచే అవకాశం ఉండదని ఆమె తెలిపారు. డ్రాఫ్ట్ బిల్లును ముందే పొందేందుకు జాతీయ పార్టీల నేతలతో మాట్లాడి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతానని ఆమె వెల్లడించారు. పార్లమెంట్‌లో మహిళలకు న్యాయం జరిగేలా అన్ని పార్టీలు ఏకం కావాలని కోరారు.

జాగృతి పోరాట ఫలితమే ఈ బిల్లు

దేశంలో మహిళా రిజర్వేషన్ల బిల్లు నేడు కార్యరూపం దాల్చడానికి తెలంగాణ జాగృతి చేసిన పోరాటాలే కారణమని కవిత గుర్తు చేశారు. గతంలో ఢిల్లీ వేదికగా తాము చేపట్టిన దీక్ష బిల్లు కోసం జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసిందని ఆమె చెప్పారు. దేశంలోని 18 రాజకీయ పార్టీలను ఏకం చేసి మహిళా కోటా కోసం సమన్వయం చేశామని ఆమె వివరించారు. జాగృతి వెలిగించిన ఈ పోరాట జ్వాల ద్వారా దేశంలోని 29 రాష్ట్రాల మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం లభించే వరకు జాగృతి తన పోరాటాన్ని ఆపబోదని కవిత స్పష్టం చేశారు.

Advertisement

Read Also: రైల్వే మన అందరిదీ అంటే ఇలా అర్థమైందా? బ్లాంకెట్లు కాజేసీ.. అమాయకంగా..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×