E-Paper
Advertisement

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్.. డైలీ సీరియల్ ఇంకెనాళ్లు.. ఈ సారి కవిత టార్గెట్ వాళ్లే!

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్.. డైలీ సీరియల్ ఇంకెనాళ్లు.. ఈ సారి కవిత టార్గెట్ వాళ్లే!
Advertisement

Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆమె చేసిన వ్యాఖ్యలు.. అలాగే, రాబోయే ‘ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ’ గురించి ఆమె మాట్లాడారు.. పూర్తి సమాచారంలోకి వెళితే..

ఫోన్ ట్యాపింగ్ కేసుపై కవిత విమర్శలు
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తీరును ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వ్యవహారం ఒక ముగింపు లేని ‘డైలీ సీరియల్’ లాగా సాగుతోందని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలైన సూత్రధారులను పక్కన పెట్టి, కేవలం కింది స్థాయి అధికారులను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. “పెద్ద చేపలను వదిలేసి, చిన్న చేపలను పట్టుకోవడం” ద్వారా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు.

Advertisement

ప్రణీత్ రావు విచారణపై సందేహాలు
ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావు విచారణ అంశాన్ని కూడా కవిత ప్రస్తావించారు. ప్రణీత్ రావును ఎందుకు కస్టడీలోకి తీసుకున్నారు, ఆయన ద్వారా ప్రభుత్వం ఏ సమాచారాన్ని రాబట్టాలనుకుంటుంది అనే విషయంలో స్పష్టత లేదని ఆమె పేర్కొన్నారు. విచారణ పారదర్శకంగా జరగడం లేదని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారం ఎప్పటికి తేలుతుందోనని ప్రజలు కూడా విసుగు చెందుతున్నారని విమర్శించారు.

కవిత పార్టీ ప్రకటన
కవిత త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటన ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే నాకు సెంటిమెంట్ ఎక్కువ.. మంచి ముహూర్తం కోసం వెయిటింగ్ చేస్తున్నాను, మూడు నెలల్లో పార్టీ ప్రకటన చేస్తానన్నారు. అంతేకాకుండా నన్ను లీడర్‌ను ప్రజలు చేయాలి. బీఆర్ఎస్ నేతలు నన్ను గుర్తిస్తే నేను లీడర్‌ను కాను అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ భవన్ కే పరిమితం అయ్యింది. గ్రౌండ్ లెవల్‌లో ఏం జరుగుతుందో చూసుకోవడం లేదు. ఇంకొంత కాలం గడిస్తే నా బలం ఏంటో తెలుస్తుందన్నారు.

Advertisement

అలాగే మున్సిపల్ ఎన్నికల్లో.. పెద్ద నాయకులు కేటీఆర్, హరీష్ రావులు రాష్ట్రం అంతటా ఎందుకు ప్రచారం చేయటం లేదు.. కేటీఆర్, హారీష్ లు రాష్ట్ర నాయకులు కాదా? అని ప్రశ్నించింది. అంతేకాకుండా కేటీఆర్ సిరిసిల్లకే ఎందుకు పరిమితం అయ్యారు. సిరిసిల్లలో 16 మంది బీఆర్ఎస్ వాళ్లు టికెట్ కోసం మమల్ని కలిశారు.. జాగృతి పోటీ చేస్తున్న చోటనే హరీష్ రావు తిరుగుతున్నారు.. కేటీఆర్, హరీష్ రావులు ఇతర జిల్లాల్లో ఎందుకు తిరగటం లేదు? అని ఆగ్రహించింది.

జీవన్ రెడ్డిని సస్పెండ్ చేసే దమ్ముందా?
గుంట నక్క, గూఢచారి పేర్లు ఆయా వ్యక్తులకు సూటబుల్ కాబట్టే పిలుస్తున్నానని తెలిపింది. అంతేకాకుండా అసలు జీవన్ రెడ్డిని సస్పెండ్ చేసే దమ్ము కాంగ్రెస్‌కు ఉందా జగిత్యాలలో జీవన్ రెడ్డి చాలా బలమైన నాయకుడు.. అప్పట్లో జీవన్ రెడ్డిని ఓడించటానికి మేము చాలా కష్టపడ్డాం అన్నారు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండే నేత జీవన్ రెడ్డి.. ఆయన కాంగ్రెస్‌ను వీడుతారని నేను అనుకోవడం లేదు అని చెప్పారు.

Also Read: జనసేన మద్దతుపై బీజేపీ పునరాలోచన? ఈనెల ఆ తేదీల్లో పవన్ ప్రచారం!

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘ఆత్మగౌరవ సభ’
ఇదే సమయంలో, తెలంగాణ ఉద్యమకారుల గౌరవాన్ని చాటిచెప్పేందుకు కవిత సిద్ధమయ్యారు. ఈ నెల 12వ తేదీన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభను నిర్వహించనున్నట్లు ఆమె ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారిని స్మరించుకోవడం, ప్రస్తుత పరిస్థితుల్లో వారి ప్రాధాన్యతను చాటడమే ఈ సభ ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×