E-Paper
Advertisement

సచివాలయం వద్ద రణరంగం.. ‘తెలంగాణ రక్షణ సేన’ అధ్యక్షురాలు కవిత అరెస్ట్!

సచివాలయం వద్ద రణరంగం.. ‘తెలంగాణ రక్షణ సేన’ అధ్యక్షురాలు కవిత అరెస్ట్!
Advertisement

Kavitha Arrest: రైతు సమస్యల పరిష్కారం కోసం సెక్రటేరియట్ ముట్టడికి యత్నించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. రైతుల పక్షాన ఆందోళనకు దిగిన ఆమెను, పార్టీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు.. అనంతరం వారిని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ముట్టడితో సచివాలయం పరిసర ప్రాంతాల్లో కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

సచివాలయం వద్ద హోరెత్తిన నినాదాలు

Advertisement

రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి నిబంధనలు లేకుండా వెంటనే ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ  కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో TRS కార్యకర్తలు పెద్ద ఎత్తున సచివాలయానికి చేరుకున్నారు. ‘రైతులకు న్యాయం చేయాలి’ అంటూ చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట బస్తాలకు కోత పెడుతూ రైతులను నిలువునా ముంచుతున్నారని ఆమె మండిపడ్డారు.

పోలీసుల రంగప్రవేశం

Advertisement

సచివాలయం వంటి హైసెక్యూరిటీ జోన్‌లో ధర్నాకు అనుమతి లేదని పోలీసులు TRS శ్రేణులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి చేతులు దాటకుండా చూసేందుకు పోలీసులు కల్వకుంట్ల కవితతో పాటు ముఖ్య నాయకులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమ గొంతు నొక్కేయాలని చూసినా, రైతుల సమస్యలు తీరే వరకు పోరాటం ఆపేది లేదని ఈ సందర్భంగా కవిత స్పష్టం చేశారు.

Also Read: మీ ఇంట్లో అందరూ సీఎంలేనా.. తెలంగాణ మీకోసం పుట్టిందా? కేటీఆర్‌పై అద్దంకి దయాకర్ ఫైర్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×