E-Paper
Advertisement

KA Paul: తెలంగాణను ముంచడానికే కవిత పార్టీ.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు!

KA Paul: తెలంగాణను ముంచడానికే కవిత పార్టీ.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

KA Paul: తెలంగాణ రాజకీయాల్లో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో స్పందించడం కొత్తేమి కాదు. అయితే, తాజాగా కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పేరుతో కొత్త పార్టీని ప్రకటించడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కవిత పార్టీ పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం తెలంగాణ అభివృద్ధి కాదని, కేవలం తన కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలే దీనికి కారణమని పాల్ ఘాటుగా విమర్శించారు.

కేఏ పాల్ మాటల్లో చెప్పాలంటే, కవిత తన తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్‌తో ఉన్న గొడవలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం ముఖ్యమంత్రి కుర్చీపై ఉన్న ఆశతోనే ఆమె ఈ కొత్త వేదికను ఎంచుకున్నారని ఆయన ఆరోపించారు. నిజానికి కవిత తీరు గురించి కేసీఆర్ తనకు 2008లోనే చెప్పారని, ఆమెను నమ్మలేమని స్వయంగా ఆయనే తనతో అన్నారని పాల్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. అసలు ఈ పార్టీని కవిత వెనుక ఉండి ఎవరు పెట్టించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఆయన పరోక్షంగా కొన్ని సంకేతాలు ఇచ్చారు.

Advertisement

గత రాజకీయ పరిణామాలను గుర్తు చేస్తూ.. గతంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం, వైఎస్ షర్మిల పెట్టిన వైఎస్సార్ తెలంగాణ పార్టీలు ఏ విధంగా కనుమరుగైపోయాయో, కవిత పార్టీకి కూడా అదే గతి పడుతుందని పాల్ జోస్యం చెప్పారు. ఇలాంటి రాజకీయ  స్వార్థం ఉన్న వ్యక్తులను నమ్మి తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణను సర్వనాశనం చేయడానికే ఈ పార్టీ పుట్టుకొచ్చిందని, ప్రజలు వాస్తవాలను గ్రహించాలని పాల్ కోరారు. మెుత్తానికి కవిత పార్టీ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త దుమారాన్ని రేపగా, పాల్ వ్యాఖ్యలు దానికి మరింత ఆజ్యం పోశాయి.

Also Read: ఒడిశాలో అరాచకం.. బైక్‌పై వెళ్తూనే మహిళ జుట్టు పట్టుకుని పిడిగుద్దులు.. వీడియో వైరల్!

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×