E-Paper
Advertisement

రేవంత్ ఒక హిట్లర్.. విద్యాశాఖ ఒక సర్కస్.. కవిత సంచలనం!

రేవంత్ ఒక హిట్లర్.. విద్యాశాఖ ఒక సర్కస్.. కవిత సంచలనం!
Advertisement

K Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థపై చేస్తున్న వ్యాఖ్యలు, తీసుకుంటున్న నిర్ణయాలపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యాశాఖను సర్కస్‌లా మార్చేశారంటూ సోమవారం ఒక వీడియో సందేశం ద్వారా ఆమె ఘాటు విమర్శలు చేశారు.

హిట్లర్, తాలిబన్లతో పోలిక

Advertisement

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు, ముఖ్యంగా ఆడపిల్లలను చదువుకు దూరం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని హిట్లర్, తాలిబన్లతో పోలుస్తూ.. ఆయన వారి కంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇంటర్, డిగ్రీ అడ్మిషన్లలో గందరగోళం

Advertisement

రాష్ట్ర విద్యాశాఖపై ముఖ్యమంత్రికి అస్సలు పట్టు లేదని కవిత విమర్శించారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఉండదని సీఎం ప్రకటించిన మరుసటి రోజే.. ఇంటర్ బోర్డు అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇవ్వడం ప్రభుత్వంలోని గందరగోళానికి అద్దం పడుతోందన్నారు. జూనియర్ కాలేజీలు ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా, ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు కనీసం అఫిలియేషన్లు కూడా ఇవ్వలేదని తప్పుబట్టారు. ఇక డిగ్రీ ‘దోస్త్’ అడ్మిషన్ల ప్రక్రియలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, కమిషనరేట్ మధ్య సమన్వయం లేక విద్యార్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

జీవో నెంబర్ 7 రద్దుకు డిమాండ్

గురుకులాల్లో వంద మందికి పైగా విద్యార్థులు చనిపోయినా సీఎం కనీసం సమీక్ష కూడా చేయకపోవడం బాధ్యతారాహిత్యమని కవిత విమర్శించారు. రూ.11 వేల కోట్ల ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలను పక్కనబెట్టి, జీవో నెంబర్ 7ను తీసుకురావడం ద్వారా ప్రైవేటు కాలేజీల దోపిడీకి ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తోందని ఆరోపించారు. వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని, అలాగే ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టేందుకు ‘ఫీజుల నియంత్రణ చట్టాన్ని’ తక్షణమే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Also Read: గేమ్స్ ఆడొద్దన్నందుకు.. కన్నవారిపైనే కత్తితో దాడి చేసిన 16 ఏళ్ల బాలుడు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×