E-Paper
Advertisement

Medak Bar Association: మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కె. జనార్ధన్ రెడ్డి గెలుపు

Medak Bar Association: మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కె. జనార్ధన్ రెడ్డి గెలుపు
Advertisement

Medak Bar Association: మెదక్ బ్యూరో, స్వేచ్ఛ- మెదక్ బార్ అసోసియేషన్ (Medak Bar Association) అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది కొలుకూరి జనార్ధన్ రెడ్డి (K Janardhan Reddy).. సమీప ప్రత్యర్థి, న్యాయవాది మార్కంటి రాములు పై 57 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. రాములుకు కేవలం 14 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఉపాధ్యక్షులుగా శోభన్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా శ్రీపతి రావు, సహాయ కార్యదర్శిగా వేణుగోపాల చారి, స్పోర్ట్స్ కార్యదర్శిగా రవి గౌడ్.. ఎన్నికైనట్లుగా ఎన్నికల అధికారి, న్యాయవాది సిరిగ ప్రభాకర్ ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా మమత మంజుల, హరీఫ్ హుస్సేన్, కే ఎన్ ఎన్ దత్తు, బి ప్రశాంత్‌లు ఎన్నికయ్యారు. ఈ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన జనార్ధన్ రెడ్డి ఏడాది కాలం పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కొనసాగనున్నారు. గతంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గానూ జనార్ధనరెడ్డి కొనసాగారు.

Also Read- Revanth Reddy MMTS Review: ఎంఎంటీఎస్ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష‌.. రద్దీ సమయాల్లో రైళ్ల సంఖ్య పెంచాలని ఆదేశం

2వ సారి మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలుపు

Advertisement

సీనియర్ న్యాయవాదిగా మంచి పేరు ఉన్న జనార్థన్ రెడ్డి మెదక్ బార్ అసోసియేషన్‌కు 2వ సారి అధ్యక్షునిగా గెలుపొందారు. మెదక్ లైన్స్ క్లబ్‌లో కీలకంగా పనిచేస్తూ లైన్స్ గవర్నర్‌గా సేవలందించారు. వెల్దుర్తి మండలం కుక్ నూర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఎయిడ్స్ వ్యాధితో చనిపోగా వారి పిల్లలిద్దరిని అన్నీ తానై చదివించారు. స్వచ్ఛందంగా సొంత ఖర్చులతో చదివించి చేరదీశారు. జనార్ధన్ రెడ్డి భార్య రజిత ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉంటూ, సామాజిక సేవా కార్యక్రమంలో సహితం ఆమె ఉత్సాహంగా పాల్గొంటారు.

Also Read- Saleshwaram Jatara: తెలంగాణ అమర్‌నాథ్ సలేశ్వరం జాతర.. ఇది భక్తి మాత్రమే కాదు, ప్రాణాలకు తెగించి చేసే ఒక మహా సాహాసం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×