// // Jubilee Hills: జూబ్లీహిల్స్ పోలింగ్ 20 శాతం నమోదు.. నాన్ లోకల్స్ పై కేసులు.. -->
E-Paper
Advertisement

Jubilee Hills: జూబ్లీహిల్స్ పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంటకు 31.94 శాతం.. నాన్ లోకల్స్ నేతల హంగామా, ఆపై కేసులు

Jubilee Hills: జూబ్లీహిల్స్ పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంటకు 31.94 శాతం.. నాన్ లోకల్స్ నేతల హంగామా, ఆపై కేసులు
Advertisement

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ఓటర్ల తీరు మారనట్టు కనిపిస్తోంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి 11 గంటల సమయానికి 20.76శాతం నమోదైంది గత ఎన్నికల్లో ఇక్కడ కేవలం 47 శాతం పోలింగే నమోదైంది. ఈ ఉప ఎన్నికల్లో అయినా పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందని భావిస్తే… అలాంటి సీన్ ఏమీ కనిపించడం లేదు. పోలింగ్ ఇప్పటికీ మందకొడిగానే సాగుతోంది. ఏ పోలింగ్‌ బూత్‌ దగ్గరా క్యూ లైన్లు లేవు.

పోలింగ్ కేంద్రాలకు వస్తున్న వారిలో వృద్ధులే ఎక్కువ ఉంటున్నారు. మిడిల్ ఏజ్డ్‌, యూత్ ఓటర్లు పెద్దగా కనిపించడం లేదు. చాలా పోలింగ్ కేంద్రాలు ఖాళీగానే ఉన్నాయి. వస్తే 10 నిమిషాల్లోనే ఓటేసి వెళ్లిపోయే అవకాశం ఉంది. కానీ.. ఓటర్లు పెద్దగా కనిపించడం లేదు. ఓటింగ్ అంటే అంత నిర్లక్ష్యం ఎందుకు? మీ ఎమ్మెల్యేను ఎన్నుకునే బాధ్యత మీకు లేదా?

Advertisement

ఓటు వేయకపోతే మీకు ప్రశ్నించే హక్కు ఉంటుందా? ఓటు వేయడానికి అరగంట టైమ్ కేటాయించలేకపోతున్నారా? ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం మన బాధ్యత అని మర్చిపోతున్నారా? ఇంట్లో కూర్చుని టీవీలో సినిమా చూసే బదులు.. పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేయొచ్చు కదా! ఇన్ స్టా రీల్స్ చేయడానికి కేటాయించే టైమ్‌లో.. కనీసం అరగంట ఓటు వేయడానికి కేటాయించలేరా? ఓటు వేయనపుడు మీకు ఓటు హక్కు ఎందుకు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్నికల అధికారులు మాత్రం ఓటు వేసేందుకు ఓటర్లంతా రావాలని కోరుతున్నారు.

Advertisement

Also Read: డిజిటల్ గోల్డ్‌పై ఇన్వెస్ట్‌మెంట్ సేఫేనా? సెబీ అలర్ట్!

జూబ్లీహిల్స్‌లో నాన్ లోకల్స్ ఉండటంపై సుదర్శన్ రెడ్డి సీరియస్..
అయితే జూబ్లీహిల్స్ లో నాన్ లోకల్స్ ఉండటంపై సీఈఓ సుదర్శన్ రెడ్డి సీరియస్ అయ్యారు. నియోజకవర్గంలోని స్థానికేతరులపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది అని చెప్పారు. అలాగే ఇప్పటి వరకు నాన్ లోకల్స్ పై 3 FIR లు నమోదు చేశామని కూడా వెల్లడించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×