E-Paper
Advertisement

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. పోటీలో 58 మంది అభ్యర్థులు

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. పోటీలో 58 మంది అభ్యర్థులు
Advertisement

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఉపఎన్నికల బరిలో మొత్తం 58 బంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇవాళ 23 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నవంబర్ 11న ఉప ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెల్లడి కానున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

Advertisement

ముఖ్యంగా జూబ్లీహిల్స్ రణ రంగంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వి.న‌వీన్ యాద‌వ్ ఖరారు కావడంతో ఇక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బలమైన లోకల్ నాయకుడిగా, యువకుడిగా నవీన్ యాదవ్‌కు నియోజకవర్గంలో గట్టి పట్టు, మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యువత సపోర్ట్ ఆయనకు ఎక్కువగా ఉంది. అయితే.. ఈ ఎన్నికల్లో కొన్ని అంశాలపై పట్టు సాధిస్తే ఆయన సులభంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది.

నవీన్ యాదవ్‌కు జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. ఆయన గత కొన్నేళ్లుగా పండుగలు, ఇతర సందర్భాలలో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల నిర్వహించిన సామూహిక సీమంతాలు వంటి కార్యక్రమాలు మహిళా ఓటర్లలో సానుకూలతను పెంచే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యావంతుడైన యువకుడు కావడంతో యువతలో ఆయనకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిగా ఆయనను ఎంపిక చేయడం, బీసీలకు 42% రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయం.. సుమారు 1.40 లక్షలు బీసీ ఓటర్లు, 90వేల మైనార్టీ ఓట్లు ఉన్న ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అంశాలు అని చెప్పవచ్చు.

Advertisement

నవీన్ యాదవ్ వ్యక్తిగత బలం ఉన్నప్పటికీ, కొన్ని పార్టీ పరమైన, రాజకీయపరమైన సవాళ్లను అధిగమించాల్సి ఉంది. దివంగత నేత మాగంటి గోపీనాథ్ సెంటిమెంట్ బీఆర్ఎస్ కు కొంత ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గోపీనాథ్‌కు నియోజకవర్గంలో మంచి సంబంధాలు ఉండటం, సునీత పోటీలో ఉండటం వల్ల మహిళా ఓటర్లు సెంటిమెంట్‌తో బీఆర్‌ఎస్ వైపు మొగ్గే అవకాశం ఉంది. నవీన్ యాదవ్ చేసిన కొన్ని సేవా కార్యక్రమాలు, మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ఈ సెంటిమెంట్ ముందు నిలబడగలవా అనేది కీలకం.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక గెలిచినంత సులభంగా ఇది ఉండకపోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సుమారు రెండేళ్లు కావడంతో, ప్రభుత్వంపై సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను నవీన్ యాదవ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. నవీన్ యాదవ్ తన వ్యక్తిగత బలం, యువత మద్దతు, బీసీ కోటా వంటి సానుకూల అంశాలతో బరిలోకి దిగుతున్నప్పటికీ.. మాగంటి గోపీనాథ్ సెంటిమెంట్, మైనార్టీ ఓటర్ల సమీకరణ, బీఆర్‌ఎస్ నగర ప్రాబల్యం వంటి ప్రధాన సవాళ్లను అధిగమించగలిగితేనే నవీన్ యాదవ్ జూబ్లీ కింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ అంశాల ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది నవంబర్ 14న ఫలితాలు వచ్చే వరకు వేచి చూడక తప్పదు మరీ…

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×