E-Paper
Advertisement

Jeevan Reddy: నువ్వెవ్వడివి మా పార్టీ వ్యవహారాల్లో మాట్లాడడానికి?.. సంజయ్‌పై జీవన్ రెడ్డి ఫైర్

Jeevan Reddy: నువ్వెవ్వడివి మా పార్టీ వ్యవహారాల్లో మాట్లాడడానికి?.. సంజయ్‌పై జీవన్ రెడ్డి ఫైర్
Advertisement

Jeevan Reddy: జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..  ఎమ్మెల్యే సంజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ రాజ్యాంగ నిబంధనలు..  నైతిక విలువల గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే స్పష్టత లేదని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థిస్తూ ఎమ్మెల్యే సంజయ్ ముఖ్యమంత్రిని కలవడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంజయ్ జోక్యం చేసుకోవడం సరికాదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. 1983 ఎన్నికల్లో టీడీపీ తనకు అవకాశం ఇచ్చిందని..  ఎమ్మెల్యేగా,  మంత్రిగా జగిత్యాల ప్రజలకు సేవ చేసినట్లు గుర్తు చేశారు. ఆ తర్వాత టీడీపీలో చంద్రబాబు నాయుడు ఆధిపత్యంతో విభేదించి నాదెండ్ల వర్గంలో చేరిన విషయాన్ని తెలిపారు. తనకి తానుగా  మంత్రిపదవికి రాజీనామా చేశానని..  1985లో పార్టీ పిరాయింపుల చట్టం అమలులోకి వచ్చిందని వివరించారు.

Advertisement

వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సంజయ్‌కు హితవు పలికారు. గత దశాబ్దాలుగా పార్టీ పిరాయింపులపై తాను ప్రశ్నిస్తూనే ఉన్నానని అన్నారు. అభివృద్ధి గురించి సంజయ్ తన వద్దే నేర్చుకోవాల్సి ఉంటుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సంజయ్ కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టిన తర్వాత కార్యకర్తల కాళ్లకు కట్టెలు పెట్టి.. వారి హక్కులను కాజేశారని ఆరోపించారు.

ఈ విషయంపై పార్టీ కార్యకర్తల అభిప్రాయాన్ని అధిష్టానానికి ఇప్పటికే తెలియజేశానని జీవన్ రెడ్డి వెల్లడించారు. ‘నువ్వెవ్వడివి మా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో మాట్లాడడానికి?’ అంటూ సంజయ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకు జరిగిన అన్యాయంపై తాను పోరాడుతూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×