E-Paper
Advertisement

అభిమానులు ఏదంటే అదే.. ఏ పార్టీలో చేరాలనేది వాళ్లే డిసైడ్ చేస్తారు, జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

అభిమానులు ఏదంటే అదే.. ఏ పార్టీలో చేరాలనేది వాళ్లే డిసైడ్ చేస్తారు, జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Advertisement

జగిత్యాల పట్టణంలోని తన స్వగృహంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మార్పు రావాలి.. కేసీఆర్ పోవాలి అని ప్రజలు కోరుకున్నారని గుర్తు చేశారు. ప్రజల్లో వచ్చిన ఆ మార్పు వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. అయితే కేవలం రెండేళ్ల కాలంలోనే పరిస్థితి పూర్తిగా తలకిందులైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రజలు మళ్ళీ మార్పు రావాలి.. రేవంత్ రెడ్డి పోవాలి అనే స్థితికి చేరుకున్నారని విమర్శించారు.

ప్రాణహిత ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. 

Advertisement

ఉమ్మడి జిల్లా ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును జీవన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ప్రాణహిత నదీ జలాలను వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రాజెక్టుల పునరుద్ధరణ పట్ల చూపుతున్న ఉదాసీనత రేవంత్ రెడ్డి నిర్లక్ష్య పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. రైతాంగ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని ఆరోపించారు. ప్రాణహిత జలాల మళ్లింపుపై స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఉత్తర తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ధ్వజమెత్తారు.

రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ.. 

Advertisement

తను ఏ పార్టీలో చేరాలనే విషయంపై అభిమానుల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. బిజెపి, బిఆర్ఎస్ నాయకులు తనపై చూపిస్తున్న అభిమానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇతర పార్టీల నేతలు తనను ఆహ్వానించడంపై సానుకూలంగా స్పందించారు. తన రాజకీయ ప్రయాణం తన అనుచరులు, కార్యకర్తల అభీష్టం మేరకే సాగుతుందని వెల్లడించారు. త్వరలోనే తన నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటిస్తానని తెలిపారు.

జీవన్ రెడ్డి భావోద్వేగం..

తన సన్నిహితుడు గంగారెడ్డి మృతిపై జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. గంగారెడ్డిని మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియామకం చేసేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినప్పటికీ అది అమలుకు నోచుకోలేదని విమర్శించారు. కారణాలు ఏవైనప్పటికీ తన చిరకాల సహచరుడిని కోల్పోవడం తీరని లోటని పేర్కొన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో కావాలనే జాప్యం చేస్తున్నట్లు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. తన వర్గానికి చెందిన వారిని పదవులకు దూరం పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌లో లేనని ప్రకటన.. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి తాను ప్రస్తుతం కాంగ్రెస్ లో లేనని కుండబద్దలు కొట్టారు. తన అడ్డు తొలగించుకోవాలనే కుట్రతోనే ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన తనను పక్కన పెట్టడం వెనుక ఉన్న వ్యూహం అందరికీ తెలుసన్నారు. జిల్లాలో తన ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కార్యకర్తల ఆత్మగౌరవం కోసం తను పోరాటం కొనసాగిస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

ALSO READ: గ్రూప్‌-1 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు తీర్పుతో క్లియర్ అయిన అడ్డంకులు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×