E-Paper
Advertisement

జగిత్యాల జైత్రయాత్ర మళ్లీ మొదలైంది.. కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రాన్ని కాపాడుతుంది: జీవన్ రెడ్డి

జగిత్యాల జైత్రయాత్ర మళ్లీ మొదలైంది.. కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రాన్ని కాపాడుతుంది: జీవన్ రెడ్డి
Advertisement

Jeevan Reddy: జగిత్యాల వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో సీనియర్ నాయకులు టి. జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తనను, జీవిత చరమాంకంలో మానసిక క్షోభకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, అయితే కాంగ్రెస్ పార్టీలో తన ఉనికికే ప్రమాదం ఏర్పడిన తరుణంలో కేసీఆర్ పెద్ద మనసుతో తనకు చేయూతనిచ్చారని కొనియాడారు.

జగిత్యాల గడ్డతో కేసీఆర్‌కు ఉన్న అనుబంధాన్ని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. విద్యార్థి దశలో కేసీఆర్ జగిత్యాల వీధుల్లో తిరిగారని, ఇక్కడి నుండే “జగిత్యాల జైత్రయాత్ర” ద్వారా పీడిత వర్గాల గొంతుకగా మారారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడిగా, రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారని ప్రశంసించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా జగిత్యాల జిల్లాను ఆవిర్భవింపజేసి, ఇక్కడ వైద్య విద్యా కళాశాల (Medical College) ఏర్పాటు కావడానికి కేసీఆర్ దూరదృష్టియే కారణమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతాంగానికి అన్నం పెట్టే పథకాలను పక్కన పెట్టి, కేవలం అధికార దాహంతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిద్రపోతున్నారని, కాలేశ్వరం ప్రాజెక్టుపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజన రిజర్వేషన్లను 6% నుండి 10%కి పెంచిన ఘనత, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన చరిత్ర కేసీఆర్‌దేనని ఆయన ఉద్ఘాటించారు. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కేవలం కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సభలో పాల్గొన్న ఇతర నేతలు కొప్పుల ఈశ్వర్, గంగాధర్ తదితరులు మాట్లాడుతూ, జీవన్ రెడ్డి చేరికతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం మొత్తం మళ్లీ కేసీఆర్ వైపు చూస్తోందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం మొదలైందని వారు పేర్కొన్నారు. “రేవంత్ రెడ్డి పోవాలి – కేసీఆర్ రావాలి” అనే నినాదం ప్రతి పల్లెలో వినిపిస్తోందని, రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా మళ్లీ ఎగరడం ఖాయమని నేతలు స్పష్టం చేశారు.

Advertisement

Read Also: తెలంగాణలో మళ్లీ గులాబీ జైత్రయాత్ర.. వంద శాతం మనమే గెలవబోతున్నాం: కేసీఆర్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×