E-Paper
Advertisement

రేవంత్ రెడ్డి పార్టీలోకి ఉడుంలా చొచ్చారు.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.

రేవంత్ రెడ్డి పార్టీలోకి ఉడుంలా చొచ్చారు.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.
Advertisement

జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ, మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి తన మనోవేదనను వెళ్లగక్కారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

ఉడుంలా చొచ్చారు.. జీవన్ రెడ్డి ఘాటు విమర్శ

Advertisement

కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఒక ఉడుంలా ప్రవేశించారని జీవన్ రెడ్డి విమర్శించారు. ఆయన రాకతోనే పార్టీలో తనకంటూ ఒక గీత గీసుకున్నారని మండిపడ్డారు. ఎవరిని ఎలా తొక్కాలి.. ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కాలి అనేదే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పనిచేశారని ఆరోపించారు. గత నాలుగు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న తనను పొమ్మనలేక పొగబెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణను.. సిద్ధాంతాలను రేవంత్ రెడ్డి తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ ప్రధాని కాకపోవడానికి కారణం ఇదే

Advertisement

రాహుల్ గాంధీ నాయకత్వంపై కూడా జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారని గుర్తు చేశారు. అయితే ఈ రెండు రాష్ట్రాలే రాహుల్ గాంధీని ప్రధాని కాకుండా అడ్డుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ ఆశించిన ఫలితాలు సాధించి ఉంటే ఈరోజు రాహుల్ గాంధీ భారత ప్రధాని అయ్యేవారని అభిప్రాయపడ్డారు. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు.. స్వార్థ రాజకీయాలే ఈ పరిస్థితికి కారణమని దుయ్యబట్టారు.

ప్రజాక్షేమం కోసమే నా ముందడుగు

కొందరు నాయకులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దూకుతారని.. కానీ తాను మాత్రం ప్రజాక్షేమం కోసమే నిలబడ్డానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేనని హెచ్ఛరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చిన్నాభిన్నమైపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం అధికారం కోసమే పాకులాడే సంస్కృతి పెరిగిపోయిందని విమర్శించారు. ఈ సమావేశంలో ఆయన మాటలు విన్న కార్యకర్తలు ఒక్కసారిగా నివ్వెరపోయారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

ALSO READ: విదేశీ ఉద్యోగాల పేరిట భారీ మోసం.. ఒక్కో జాబ్‌కు రూ.4,00,000.. ముఠా ARREST

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×