E-Paper
Advertisement

రాజకీయాల్లోకి జీవన్ రెడ్డి కోడలు చరిష్మారెడ్డి.. రాజీనామా వెనుక పెద్ద ప్లానే..!

రాజకీయాల్లోకి జీవన్ రెడ్డి కోడలు చరిష్మారెడ్డి.. రాజీనామా వెనుక పెద్ద ప్లానే..!
Advertisement

జీవన్ రెడ్డి.. రాజకీయాల్లో మంచి పట్టు ఉన్న నేత.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో మోస్ట్ సీనియర్ లీడర్.. కాంగ్రెస్ పార్టీతో 44 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన తదుపరి రాజకీయ అడుగులను స్పష్టం చేస్తున్నారు. కేవలం పార్టీ మారడమే కాకుండా తన రాజకీయ వారసురాలిని ప్రజలకు పరిచయం చేసేందుకు ఆయన వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. జీవన్ రెడ్డి కోడలు చరిష్మారెడ్డి త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్త ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

గత అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎమ్మెల్సీ పదవి రెన్యూవల్ కాకపోవడం జీవన్ రెడ్డిని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. దీనికి తోడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడంతో తన ప్రాధాన్యత తగ్గిందని ఆయన భావించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ తీరుపై నిప్పులు చెరిగిన పెద్దాయన.. చివరకు తన దారి తాను చూసుకున్నారు. అయితే ఈ మార్పు వెనుక తన కుటుంబ రాజకీయ భవిష్యత్తును భద్రపరచుకోవాలనే పెద్ద స్కెచ్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇప్పటికే జీవన్ రెడ్డితో చర్చలు జరిపినట్లు సమాచారం. ఆయన పార్టీలోకి వస్తే సెక్రటరీ జనరల్ పదవితో పాటు భవిష్యత్తులో రాజ్యసభ సీటు ఇస్తామని గులాబీ బాస్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా జీవన్ రెడ్డి కోడలు చరిష్మారెడ్డికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు బిఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది.

చరిష్మారెడ్డి ఇప్పటికే జగిత్యాల నియోజకవర్గంలో చురుగ్గా ఉంటున్నారు. ఉన్నత విద్యావంతురాలిగా పేరున్న ఆమె గత మున్సిపల్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి అనుచరుల తరపున ప్రచారం నిర్వహించి నలుగురు అభ్యర్థులను గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. కార్యకర్తలతో మమేకమవ్వడం మామయ్య రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించడంలో ఆమె తనదైన ముద్ర వేశారు.

Advertisement

వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగినా లేకపోయినా జగిత్యాల నుండి చరిష్మారెడ్డిని బరిలోకి దింపేలా జీవన్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇన్నాళ్లు తన వారసులను రాజకీయాలకు దూరంగా ఉంచిన పెద్దాయన.. ఇప్పుడు తన కోడలిని వారసురాలిగా ప్రకటించి రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరలేపబోతున్నారు. ఉగాది శ్రీరామనవమి ఫ్లెక్సీలలో ఒంటరిగా కనిపించిన జీవన్ రెడ్డి.. త్వరలోనే గులాబీ కండువా కప్పుకుని తన వారసురాలితో కలిసి ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ALSO READ: Hate speech : రేవంత్ ‘హేట్ స్పీచ్’ అస్త్రం.. ఇక నోర్లు మూగబోవాల్సిందేనా?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×