E-Paper
Advertisement

GHMC: జీహెచ్ఎంసీకి మూడు కార్పొరేషన్లు.. ముగ్గురు ఆఫీసర్లు..?

GHMC: జీహెచ్ఎంసీకి మూడు కార్పొరేషన్లు.. ముగ్గురు ఆఫీసర్లు..?
Advertisement

GHMC:స్వేఛ్చ బ్యూరో: జీహెచ్ఎంసీలో పాలక మండలి అధికార గడువు మంగళవారంతో ముగియటంతో స్పెషలాఫీసర్ పాలనను ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం యువజన సర్వీసులు, క్రీడల శాఖలకు ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న జయేష్ రంజన్‌ను జీహెచ్ఎంసీ(GHMC)తో పాటు తాజాగా విభజించిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా స్పెషలాఫీసర్ గా వ్యవహారించనున్నట్లు సర్కారు ఆదేశాల్లో పేర్కొంది.

ఉత్తర్వులు జారీ..

ప్రభుత్వ ఆదేశాల మేరకు జయేష్ రంజన్ బుధవారం ఉదయం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఆయన్ను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు జయేష్ రంజన్ స్పెషలాఫీసర్ గా బాధ్యతలను కూడా స్వీకరించారు. నిన్న మొన్న వరకు విస్తరిత జీహెచ్ఎంసీకి కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న ఆర్.వి. కర్ణన్‌ను 150 వార్డులతో కొత్తగా విభజించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ గా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Also Read: Musi River Project: మూసీ ప్రక్షాళనకు మొట్టమొదటి భూసేకరణ ఈ జిల్లా నుంచే ప్రారంభం

కమిషనర్లుగా బాధ్యతలు..

నవంబర్ 25వ తేదీన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, ఆ తర్వాత పెరిగిన జీహెచ్ఎంసీ పరిధి పునర్విభజించిన తర్వాత ఆరు జోన్లకు అదనపు కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ ఆఫీసర్లు సృజన, వినయ్ కృష్ణారెడ్డిలు కూడా సర్కారు ఆదేశాల మేరకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ లకు కమిషనర్లుగా బాధ్యతలను స్వీకరించారు.

Advertisement

Also Read: YS jagan : ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ గోల..రూల్స్ మరిచారా?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×