E-Paper
Advertisement

సర్కారీ బిడ్డలకు జయన్న ఫౌండేషన్ భరోసా..!

సర్కారీ బిడ్డలకు జయన్న ఫౌండేషన్ భరోసా..!
Advertisement

Jayanna Foundation: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధించిన విద్యార్థులకు జయన్న ఫౌండేషన్ అండగా నిలిచింది. హుజురాబాద్ మండలంలోని 13 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమక్షంలో శనివారం ఘనంగా బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబరిచిన 35 మంది విద్యార్థులకు నగదు బహుమతులు మరియు షీల్ట్‌లను అందజేశారు.

ఉపాధ్యాయుల కృషి.. తల్లిదండ్రుల ప్రోత్సాహం..

ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ సరిత జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల విజయాల్లో ఉపాధ్యాయుల కష్టం, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని కొనియాడారు. “నేను కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థినే. 5 కిలోమీటర్లు నడిచి వెళ్లిన ఆనాటి కష్టాలు నాకు తెలుసు. అందుకే పేద విద్యార్థులు ఇబ్బంది పడకూడదని ఈ చిరుసాయం చేస్తున్నాను” అని భావోద్వేగానికి లోనయ్యారు. ఉపాధ్యాయులు అంకితభావంతో బోధించడం వల్లే నేడు ప్రభుత్వ స్కూళ్లలో 571 వంటి ఉత్తమ మార్కులు సాధ్యమయ్యాయని హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Also read: బడ్జెట్ ధరలోనే.. Aabo సూపర్ స్మార్ట్ రింగ్, మీ ఆరోగ్యం మీ గుప్పిట్లో!

స్కూల్ రూపురేఖలు మార్చేలా ఫౌండేషన్ హామీలు..

విద్యార్థులకే కాకుండా స్కూళ్ల అభివృద్ధికి ఫౌండేషన్ భారీ హామీలు ఇచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోపు మండలంలోని స్కూళ్లలో మూత్రశాలల మరమ్మతులు, ఫ్యాన్లు, ఫర్నిచర్ వంటి సౌకర్యాలు కల్పిస్తామని చైర్మన్ ప్రకటించారు. అలాగే విద్యార్థినులకు ఏడాదికి సరిపడా శానిటరీ ప్యాడ్లను ఉచితంగా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొని ఫౌండేషన్ సేవలను కొనియాడారు.

Advertisement

Also read: మరో సంచలన రికార్డును సొంతం చేసుకున్న తెలంగాణ సర్కార్..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×