E-Paper
Advertisement

Jangaon Municipality: జ‌న‌గామ మున్సిపాలిటీలో హంగ్.. బేర సారాలతో క్యాంపులు అల్లకల్లోలం

Jangaon Municipality: జ‌న‌గామ మున్సిపాలిటీలో హంగ్.. బేర సారాలతో క్యాంపులు అల్లకల్లోలం
Advertisement

Jangaon Municipality: స్వేఛ్చ బ్యూరో: జ‌న‌గామ మున్సిపాలిటీ హంగ్ రావ‌డం కౌన్సిల‌ర్ల పాలిట వ‌రంగా మారింది. ఇప్పుడు కౌన్సిలర్లు కోటి ఆశ‌ల‌తో ఉన్నారు. ఎవ్వ‌రి మ‌ద్దతు కావాలో వారు ఇస్తే ప‌ద‌వి, లేకుంటే కాసులు అనే చందంగా బేరసారాలు సాగుతున్నాయని తెలుస్తుంది. బీ ఆర్ ఎస్ నుంచి 13మంది, కాంగ్రెస్ నుంచి 12, సీపీఐ ఎం కు ఒక‌రు గెలిచారు. ఇక్క‌డి వర‌కు బాగానే ఉంది. మ‌రో నాలుగు స్థానాలు ఇండిపెండెంట్లు గెలిచారు. దీంతో జ‌న‌గామ మున్సిపాలిటీలో బీ ఆర్ ఎస్‌కు, కాంగ్రెస్‌కు స్ప‌ష్ట‌మైన మెజారిటీ రాక‌పోవ‌డంతో హంగ్ ఏర్ప‌డింది. దీంతో ఇండిపెండెంట్లుగా న‌లుగురు గెల‌వ‌డంతో ప్ర‌ధాన పార్టీల‌కు కంటిమీద కునుకు లేకుండా పోయింది. బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి చేసుకున్న స్వ‌యంకృప‌రాదం, కాంగ్రెస్ నేత‌ల అనైక్య‌త‌తో న‌లుగురు ఇండిపెండెంట్లు గెలిచార‌నేది సుస్ప‌ష్టం. బీ ఆర్ ఎస్, కాంగ్రెస్‌లు చైర్మ‌న్ పీఠం ద‌క్కించుకోవాలంటే ఇండిపెండెంట్లు కీల‌కం కావ‌డంతో వారి ద‌శ తిరిగింద‌నే చెప్పాలి.

వ‌స్తే ప‌ద‌వి.. లేకుంటే కాసులు

ఇండిపెండెంట్లుగా గెలిచిన వారు ఇప్పుడు కోటీ ఆశ‌ల‌తో ఉన్నారు. ఇండిపెండెంట్లు అవ‌స‌రం అయిన రెండు పార్టీల నేత‌లు వారితో మంత‌నాలు జ‌రుపుతున్నారు. దానికి వారు కొండెక్కి కూర్చున్నారు. ప‌ద‌వి ఇస్తారా మీకు స‌పోర్టు చేస్తాము.. లేదా ఇచ్చేవారికి మా మ‌ద్ద‌తు ఇస్తామంటున్నారు. ప‌ద‌వి కాదంటే.. ఎన్నిక‌ల్లో గెలిచేందుకు చాలా ఖ‌ర్చు చేశాము. ఆ ఖ‌ర్చులు భ‌రిస్తే.. ఆవి మాకు ఇస్తే స‌రే లేకుంటే మా దారి మేము చూసుకుంటామంటూ ఖ‌రాఖండిగానే చెపుతున్నారు. ఇప్పుడు ఇండిపెండెంట్లుగా గెలిచిన వారికి జాక్‌పాట్ త‌గిలింద‌నే ప్రచారం సాగుతుంది. పార్టీ బీ ఫామ్ మీద గెలిచిన వారిక‌న్నా ఇండిపెండెంట్లుగా గెలిచిన‌వారి ద‌శే బాగుంద‌ని అనుకుంటున్నారు.

Advertisement

Also Read: International Condom Day: ఆ రాష్ట్రంలోని హెచ్‌ఐవీ కేసుల్లో 70 శాతం లైంగిక సంబంధాల వల్లే.. ఆరోగ్య శాఖ మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు

ఇండిపెండెంట్లు కోటి ఆశ‌ల‌ు

బీ ఆర్ ఎస్‌, కాంగ్రెస్ కౌన్సిల‌ర్లు. జ‌న‌గామ‌లో ఒక ఇండిపెండెంట్ కౌన్సిల‌ర్ నాకు బార్ అనుమ‌తి ఇస్తే చాలు.. నాకు కాసులు వ‌ద్దు అని ఖ‌రాఖండిగా చెప్పార‌ట‌. దీంతో ఆయ‌న మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మున్న పార్టీ నాయ‌కులు స‌రే అన్నార‌ని లోకం కోడై కూస్తుంది. ఇండిపెండెంట్లుగా ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థుల‌కు ధీటుగా ఖ‌ర్చు చేశారు. ఇప్పుడు ఆ ఖ‌ర్చుల‌ను పూడ్చుకునే ప‌నిలో ఉన్నార‌ని వినికిడి. ఏదేమైనా ఇండిపెండెంట్లు కోటి ఆశ‌ల‌తో ఉన్నార‌న్న‌ది ప్ర‌జ‌ల అబిప్రాయం. దానికి ప్ర‌ధాన పార్టీల‌ నాయ‌కులు కూడా మీ కోటీ ఆశ‌ల‌ను తీర్చేందుకు సిద్ద‌మే అని త‌లాడిస్తున్నారు. ఎందుకంటే జ‌న‌గామ మున్సిపాలిటీపై త‌మ పార్టీ జెండా ఎగురాల‌న్న‌దే వారి ప్ర‌ధాన ఆశ‌యం. ఇప్పుడు కౌన్సిల‌ర్లు ఎలా ఉన్నారంటే మీకు మా అవ‌స‌రం.. ఇది మాకు అవ‌కాశం అన్న‌ట్లుగా ఉన్నార‌న్న‌ది నిజం.

స్వ‌ప‌క్షంతో స‌వాళ్ళు

Advertisement

జ‌న‌గామ చైర్మ‌న్ గిరి ద‌క్కించుకునేందుకు రెండు పార్టీల‌కు చెందిన ఓ వైపు యుద్ధం చేస్తుంటే మ‌రో వైపు గెలిచిన కౌన్సిల‌ర్లు చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ ప‌ద‌వి కోసం కుస్తిప‌ట్లు ప‌డుతున్నారని స‌మాచారం. గెలిచిన కౌన్సిల‌ర్ల‌తో రెండు ప్ర‌ధాన పార్టీల నాయ‌కులు క్యాంపులు నిర్వ‌హిస్తున్నారు. చైర్మ‌న్ ప‌ద‌విని ఆశిస్తున్న కౌన్సిల‌ర్లు క్యాంపుల ఖ‌ర్చులు భ‌రిస్తున్నార‌ని టాక్‌. చైర్మ‌న్ ప‌ద‌వి పొందితే మాకేంటి లాభం అని స్వ‌ప‌క్షంలోని కౌన్సిల‌ర్లు ప్రశ్నిస్తున్నార‌ట‌. మాకు ఖ‌ర్చులు అయ్యాయి. వాటిని ఎవ్వ‌రు తీర్చాలి. మీరు చైర్మ‌న్ అయితే మాకేంటి లాభం అనే తీరుతో పంచాయ‌తీలు న‌డుస్తున్నాయ‌ట‌. వీటికి తోడు క్యాంపుల్లోనూ స‌రైన తీరుగా చూసుకోవ‌డం లేద‌ని అలుగుడు గులుగుడు ఉండ‌నే ఉన్నాయ‌ట‌. ఏదేమైనా చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ ప‌ద‌వులు పొందేవారు ఇప్పుడు ప‌డుతున్న యాత‌న మామూలుగా లేద‌ట‌. స్వ‌ప‌క్షంలోనే విప‌క్షంలా ఉన్న కౌన్సిల‌ర్ల‌ను బుజ్జ‌గించే ప‌నిలో నాయ‌కులు, ప‌ద‌వులు ఆశిస్తున్న‌వారు ఉన్నార‌ట‌. ఏదేమైనా ఈనెల 16న చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ ప‌ద‌వుల ఎన్నిక‌ల‌తో వీట‌న్నింటికి తెర ప‌డుతుంద‌ని రాజ‌కీయ నాయ‌కులు భావిస్తున్నారు.

Also Read: AK47 Movie: త్రివిక్రంకు కోపం తెప్పించిన ‘ఏకే 47’ సినిమాటొగ్రఫర్.. ఏం చేశారంటే?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×