E-Paper
Advertisement

తెలంగాణలో జనసేన 2.0.. మణికొండలో పార్టీ ఆఫీసు, అక్కడి నుంచే వ్యూహరచన

తెలంగాణలో జనసేన 2.0.. మణికొండలో పార్టీ ఆఫీసు, అక్కడి నుంచే వ్యూహరచన
Advertisement

Hyderabad: తెలంగాణలో జనసేన పార్టీ మళ్లీ యాక్టివ్ అవుతోందా? ఆ పార్టీ యాక్టివేట్ అయితే ఏ పార్టీ ఓట్లను చీల్చనుందా? జాతీయ పార్టీల ఓట్లా? లేకుంటే ప్రాంతీయ పార్టీల ఓట్లా? ఇవే ప్రశ్నలు రాజకీయ పార్టీలను వెంటాడుతున్నాయి? ఈ లెక్కన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు జనసేన అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

తెలంగాణలో జనసేన 2.0.. మణికొండలో పార్టీ ఆఫీసు

Advertisement

తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలు జోరందుకోనుంది. హైదరాబాద్‌లో ఆ పార్టీ కార్యాలయాన్ని రెడీ చేసింది. మణికొండలో ఏర్పాటు చేసింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఆఫీసు ఏర్పాటు చేశారంటే ఆ పార్టీ కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి. దానికి సంబంధించి తెర వెనుక పనులు జరుగుతున్నాయి.

కొన్నాళ్లుగా తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలు విస్తరించాలని ఆ పార్టీ ఆలోచన చేస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జనసేన తెలంగాణపై ఫోకస్ చేసింది. అందుకు కారణాలు లేకపోలేదు. తమిళనాడు ఎన్నికల్లో అక్కడి ఓటర్లు ద్రవిడ పార్టీలను పక్కన పెట్టేశారు. కొత్తగా వచ్చిన టీవీకే పార్టీకి ప్రజలు పట్టారు.

Advertisement

జీహెచ్ఎంసీ ఎన్నికలపై జనసేన ఫోకస్

ఒక విధంగా చెప్పాలంటే యూత్ ఓటర్లు(జెన్ జీ) ఎక్కువగా టీవీకే వైపు మొగ్గు చూపినట్టు తేలింది. ఈ క్రమంలో జనసేన దృష్టి పెట్టినట్టు కొందరు నేతలు చెబుతున్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ బరిలోకి దిగనుంది. దీనిపై ఇప్పటికే జనసేన అధినేత సంకేతాలు ఇచ్చారు.

పొత్తుల విషయమై ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు తాము ఏమీ అనుకోలేదని మనసులోని మాట బయటపెట్టారు. ఈ లెక్కన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసే అవకాశముందని ఆ పార్టీ నేతల మాట.

ALSO READ: తెలంగాణలో మూడురోజులు భానుడి ప్రతాపం.. హైదరాబాద్ అయితే, ఆ తర్వాతే వాన కబురు 

జనసేన ఎన్నికల బరిలోకి దిగడంతో ఎవరి ఓట్లు చీల్చుతారనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జాతీయ పార్టీల ఓట్లు చీల్చుతారా? లేకుంటే ప్రాంతీయ పార్టీల ఓట్లు డైవర్ట్ అవుతాయా? దీనిపై పార్టీల నేతలు రకరకాలుగా స్పందిస్తున్నారు.  మొత్తానికి ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×