E-Paper
Advertisement

Pemberthy Incident: పెంబర్తి వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్యే పల్లా ‘గో బ్యాక్’ నినాదాలతో హోరెత్తించిన కాంగ్రెస్ శ్రేణులు.. చెదరగొట్టిన పోలీసులు!

Pemberthy Incident: పెంబర్తి వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్యే పల్లా ‘గో బ్యాక్’ నినాదాలతో హోరెత్తించిన కాంగ్రెస్ శ్రేణులు.. చెదరగొట్టిన పోలీసులు!
Advertisement

Pemberthy Incident: జనగామ జిల్లా పెంబర్తి వద్ద శుక్రవారం మంత్రి సీతక్క పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమరవీరుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ శ్రేణుల మధ్య తలెత్తిన వివాదం బాహాబాహికి దారితీసింది.

పెంబర్తి క్రాస్ రోడ్డు వద్ద వీరనారి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సర్వాయి పాపన్న విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు మంత్రి సీతక్కతో పాటు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. కొబ్బరికాయ కొట్టే సమయంలో, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్థానిక బిఆర్ఎస్ కౌన్సిలర్‌ను ఆహ్వానించడంతో వివాదం మొదలైంది.

Advertisement

ఇది ప్రభుత్వ కార్యక్రమమని, బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమం కాదని కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.  కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా “పల్లా గో బ్యాక్” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

పరిస్థితి విషమించడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మంత్రి పర్యటనలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ స్థాయిలో ఘర్షణ జరగడం స్థానికంగా కలకలం రేపింది.

Advertisement

Read Also: Daggubati Family: దగ్గుబాటి ఫ్యామిలీకి నాన్ బెయిలబుల్ వారెంట్.. కోర్టు సీరియస్ వార్నింగ్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×