E-Paper
Advertisement

ఆర్టీసీ బస్సు చోరీ.. మూవీ రేంజ్‌లో ఛేజ్.. సీన్ కట్ చేస్తే!

ఆర్టీసీ బస్సు చోరీ.. మూవీ రేంజ్‌లో ఛేజ్.. సీన్ కట్ చేస్తే!
Advertisement

Bus Stolen: సినిమా ఫైట్‌ను తలపించేలా ఒక ఛేజింగ్ సీన్ రియల్ లైఫ్‌లో జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి? అచ్చం అలాంటి సస్పెన్స్, డ్రామాతో కూడిన సంఘటనే జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బస్టాండ్‌లో ప్రశాంతంగా నిలిపి ఉంచిన ఒక ఆర్టీసీ బస్సును ఓ అజ్ఞాత వ్యక్తి దొంగిలించడం, దానిని పట్టుకోవడానికి పోలీసులు సుమారు 18 కిలోమీటర్ల మేర వెంబడించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో సదరు దుండగుడు రహదారిపై సృష్టించిన బీభత్సం ప్రయాణికులను, వాహనదారులను భయాందోళనకు గురిచేసింది.

ప్లాట్‌ఫామ్‌పై నుంచి మాయమైన బస్సు
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల డిపోకు చెందిన TS 08 Z 0103 నంబర్ గల ఆర్టీసీ బస్సును డ్రైవర్ ప్రవీణ్, కండక్టర్‌తో కలిసి కోరుట్ల బస్టాండ్‌లోని 8వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిలిపారు. అనంతరం వారు కొద్దిసేపు పక్కకు వెళ్లారు. సరిగ్గా అదే సమయాన్ని ఆసరాగా చేసుకున్న ఒక అపరిచిత వ్యక్తి నెమ్మదిగా బస్సులోకి ఎక్కాడు. ఎవరూ గమనించని క్షణాల్లో ఇంజిన్ స్టార్ట్ చేసి, నిజామాబాద్ వైపు వేగంగా బస్సును తీసుకెళ్లాడు. ప్లాట్‌ఫామ్‌పై ఉండాల్సిన బస్సు ఒక్కసారిగా కదలడం చూసి ఆర్టీసీ ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. తక్షణమే తేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

18 కిలోమీటర్ల హైడ్రామా..
విషయం తెలిసిన వెంటనే మెట్‌పల్లి సర్కిల్ పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తమై ప్రత్యేక వాహనాల్లో బస్సును వెంబడించడం ప్రారంభించారు. పోలీసు వాహనాలు వెనుక వస్తున్నాయని గ్రహించిన దొంగ, దొరక్కుండా తప్పించుకోవడానికి బస్సును మరింత తీవ్రమైన వేగంతో నడిపాడు. ఈ క్రమంలో కోరుట్ల, ఆరపేట, వెంకట్రావు పేట గ్రామాల వద్ద రహదారిపై వెళ్తున్న మూడు ద్విచక్ర వాహనాలను బస్సుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదాల్లో బైకర్లు అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అంతటితో ఆగకుండా, తమను వెంబడిస్తున్న పోలీసు వాహనాన్ని కూడా బస్సుతో గుద్దేయడంతో ఆ వాహనం తీవ్రంగా దెబ్బతింది.

గండి హనుమాన్ వద్ద చెక్‌మేట్..
పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన పోలీసులు, వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించి ముందస్తు చర్యలు చేపట్టారు. మెట్‌పల్లి మండల పరిధిలోని ‘గండి హనుమాన్’ ఆలయం సమీపంలో జాతీయ రహదారికి అడ్డుగా భారీ వాహనాలను రోడ్డుపై నిలిపివేసి బారికేడ్లను ఏర్పాటు చేశారు. వేగంగా వచ్చిన బస్సు ముందుకు వెళ్లే దారి లేకపోవడంతో, ఆ అజ్ఞాత వ్యక్తి తప్పించుకునే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టును గట్టిగా ఢీకొట్టి ఆగిపోయాడు. బస్సు ఆగగానే కాలినడకన పారిపోయేందుకు యత్నించిన ఆ దుండగుడిని చుట్టుముట్టిన పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.

Advertisement

Also Read: మా గొంతు నొక్కొచ్చు.. కానీ యువత ఆగ్రహాన్ని ఆపలేరు.. రాహుల్, ప్రియాంకల అరెస్ట్‌పై మండిపడ్డ సీఎం రేవంత్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×