E-Paper
Advertisement

Jagtial District: టూరిస్ట్ బస్సుపై పోకిరీల దాడి.. తిరగబడిన స్టూడెంట్స్, చివరకు ఏమైందంటే..?

Jagtial District: టూరిస్ట్ బస్సుపై పోకిరీల దాడి.. తిరగబడిన స్టూడెంట్స్, చివరకు ఏమైందంటే..?
Advertisement

మద్యం, గంజాయి మత్తులో కొందరు యువకులు బరితెగించి ప్రవర్తించిన ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. ధర్మారం మండల కేంద్రం సమీపంలోని ఒక పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం రాత్రి ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్తున్న వరంగల్‌కు చెందిన ఒక విద్యాసంస్థ విద్యార్థులపై పోకిరీలు విరుచుకుపడ్డారు.

మత్తులో హల్‌చల్..

Advertisement

స్థానిక సమాచారం ప్రకారం.. మత్తు పదార్థాల ప్రభావంతో ఉన్న కొందరు యువకులు అంతకుముందే రోడ్డుపై వెళ్తున్న పలువురితో గొడవకు దిగారు. అనంతరం సమీపంలోని పెట్రోల్ బంకుకు చేరుకున్న వీరు, అక్కడ డీజిల్ కోసం ఆగిన వరంగల్ విద్యాసంస్థకు చెందిన టూరిస్ట్ బస్సును లక్ష్యంగా చేసుకున్నారు. బస్సు డ్రైవర్‌తో అసభ్య పదజాలంతో వాగ్వాదానికి దిగి, బస్సులోని విద్యార్థుల పట్ల విచ్చలవిడిగా ప్రవర్తించారు. విద్యార్థినుల ముందే వీరంగం చేస్తూ భయాందోళనకు గురిచేశారు.

తిరగబడ్డ విద్యార్థులు..

Advertisement

పోకిరీల ఆగడాలు మితిమీరడంతో.. భయాన్నే వదిలి విద్యార్థులందరూ ఒక్కసారిగా తిరగబడ్డారు. తమ రక్షణ కోసం సమిష్టిగా పోకిరీలను అడ్డుకోవడంతో వారు అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణ దృశ్యాలన్నీ పెట్రోల్ బంకులోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. మత్తులో ఉన్న యువకులు విచక్షణ కోల్పోయి బస్సుపై రాళ్లతో దాడి చేసేందుకు కూడా ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

పోలీసులకు ఫిర్యాదు..

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పెట్రోల్ బంక్ యజమానితో పాటు విద్యాసంస్థ ప్రతినిధులు కూడా బుధవారం పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం, గంజాయి మత్తులో యువత ఇలాంటి దాడులకు పాల్పడటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ALSO READ: Top 20 News Today: గచ్చిబౌలిలో హై టెన్షన్.. స్టార్ హోటల్ పై 50 మంది దుండగుల దాడి, అన్వేష్‌‌పై పోలీసులకు ఫిర్యాదు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×