E-Paper
Advertisement

కేటీఆర్ ఖాళీగా ఉన్నారు.. అందుకే చర్చలకు పిలుస్తున్నారు: జగ్గారెడ్డి

కేటీఆర్ ఖాళీగా ఉన్నారు.. అందుకే చర్చలకు పిలుస్తున్నారు: జగ్గారెడ్డి
Advertisement

Jagga Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య సాగుతున్న సవాల్-ప్రతిసవాళ్లపై మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. కేటీఆర్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు కాబట్టే చర్చలంటూ హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి చాలా బిజీ!

Advertisement

గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడమే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరిపోతోందని జగ్గారెడ్డి అన్నారు. ఒకపక్క అప్పుల భారం, మరోపక్క రైతులకు ఇచ్చిన హామీల అమలుతో సీఎం రేవంత్ రెడ్డి రాత్రింబవళ్లు ఎంతో బిజీగా గడుపుతున్నారని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉందన్నారు.

Also Read: వాట్సాప్ ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌పై కేంద్రం నజర్.. ‘మెటా’కు నోటీసులు?

Advertisement

మిగులు బడ్జెట్ ఇస్తే చర్చించేవాళ్లం..

బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను మిగులు బడ్జెట్ రాష్ట్రంగా కాకుండా, అప్పుల తెలంగాణగా మార్చిందని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. ఒకవేళ గత ప్రభుత్వం కాంగ్రెస్‌కు మిగులు బడ్జెట్ అప్పగించి ఉంటే, కేటీఆర్ కోరినట్టుగా చర్చలు జరపడానికి తమకు వీలుండేదని స్పష్టం చేశారు. కానీ ఖజానా ఖాళీ చేసి, ఇప్పుడు చర్చలంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.

అధికారం పోయాకే కేటీఆర్‌కు రైతులు గుర్తొచ్చారు..

పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రైతుల కష్టాలు పట్టించుకోని కేటీఆర్, ఇప్పుడు అధికారం పోయాక రైతుల గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీతో పాటు మిగిలిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తుందని, కేటీఆర్ ఎన్ని రాజకీయాలు చేసినా ప్రజలు నమ్మరని ఆయన స్పష్టం చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×