E-Paper
Advertisement

Telangana Budget-2026: కాంగ్రెస్ బడ్జెట్‌పై బీఆర్ఎస్ పెదవి విరుపు, అంతా ద్రోహమేనన్న జగదీష్‌రెడ్డి

Telangana Budget-2026: కాంగ్రెస్ బడ్జెట్‌పై బీఆర్ఎస్ పెదవి విరుపు, అంతా ద్రోహమేనన్న జగదీష్‌రెడ్డి
Advertisement

Telangana Budget-2026: శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ కామెంట్స్ చేసింది. బడ్జెట్ అంతా మోసం, ద్రోహమని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అన్నివర్గాల ప్రజలకు చెవులో పువ్వులు పెట్టారు తప్ప ఎక్కడా ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదన్నారు.

తెలంగాణ బడ్జెట్‌ 2026 బాగుందని  ప్రభుత్వం చెబుతోంది

Advertisement

శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. బడ్జెట్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువత గురించి ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. మహిళలకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు. ఆసరా పింఛన్ల పెంపు మాటేదని ప్రశ్నించారు. రైతు భరోసా గురించి చెప్పకుండా రైతులను దారుణంగా మోసం చేశారంటూ దుయ్యబట్టారు.

బడ్జెట్లో స్కీమ్ లను మరిపించారని స్కామ్ లకు తెరలేపారన్నారు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. 42 శాతం రిజర్వేషన్లతో పాటు బీసీలకు ఇస్తానన్న రూ. 60 కోట్ల మాటేందని ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వస్తుందని భావించి, సమ్మక్క సారక్కకు ఇచ్చే బెల్లాన్ని ఇచ్చి చెవిలో పెద్ద పువ్వు పెట్టారని అన్నారు. బడ్జెట్‌లో ప్రభుత్వం డొల్లతనం స్పష్టంగా కనిపించిందన్నారు.

Advertisement

కాంగ్రెస్ బడ్జెట్‌ అంతా మోసం అన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతేకాదు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి, వివేకానంద గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్నివర్గాలకు న్యాయం చేసే విధంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య.

వ్యవసాయానికి బడ్జెట్‌లో పెద్ద పీట వేశారన్నారు. కేసీఆర్ పండించిన సన్న వడ్లకు కూడా బోనస్ డబ్బులు పంపించామన్నారు. ఇంత మంచి బడ్జెట్‌ని అసెంబ్లీలో ప్రవేశపెడుతుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని చెప్పారు.

ALSO READ: తెలంగాణ బడ్జెట్‌లో కొత్త పథకం.. ప్రతి కుటుంబానికి జీవిత బీమా

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×