// // IT Raids: అమిత్‌షా టూర్‌కు ముందు కలకలం.. బీఆర్‌ఎస్‌ నేతల టార్గెట్‌గా ఐటీ రైడ్స్.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

IT Raids: అమిత్‌షా టూర్‌కు ముందు కలకలం.. బీఆర్‌ఎస్‌ నేతల టార్గెట్‌గా ఐటీ రైడ్స్..

IT Raids: అమిత్‌షా టూర్‌కు ముందు కలకలం.. బీఆర్‌ఎస్‌ నేతల టార్గెట్‌గా ఐటీ రైడ్స్..
Advertisement
brs it raids

IT Raids in Telangana(TS news updates): భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డి, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేస్తోంది ఐటీ. ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. మెయిన్‌ల్యాండ్‌ టెక్నాలజీ కంపెనీలో పైళ్ల శేఖర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మర్రి జనార్థన్‌రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ కారణంగానే ఒకేసారి ముగ్గురిపై ఐటీ దాడులు జరుగుతున్నాయ్‌.

మెయిన్‌ల్యాండ్‌ టెక్నాలజీ డైరెక్టర్‌గా ఉన్నారు కొత్త ఎంపీ ప్రభాకర్‌రెడ్డి భార్య మంజులత. ఈ కంపెనీ భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయ్‌. వచ్చిన లాభాలతో హైదరాబాద్‌ చుట్టుపక్కల భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయ్‌.

Advertisement

బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లపై ఐటీ సోదాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ దూకుడు తగ్గింది. చేరికలు పూర్తిగా ఆగిపోయాయ్‌. అంతేకాదు.. పార్టీలో చేరినవారు కూడా సొంత గూటికి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అమిత్‌షా రాకతో మళ్లీ పుంజుకోవాలని భావిస్తోంది బీజేపీ. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు గట్టిగా నాలుగు నెలల సమయమే ఉంది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్‌లో ఆర్థికంగా బలంగా ఉన్న నేతలపై ఐటీ ఎటాక్స్ చేయడం కలకలం రేపుతోంది.

ఐటీ సోదాలు ఈ ముగ్గురితోనే ఆగుతాయా? మరికొందరు బీఆర్‌ఎస్‌ నేతలను టార్గెట్‌ చేస్తారా? అన్నది హాట్‌ టాపిక్‌ అయింది. ఇటీవల బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు విమర్శల విషయంలో వెనక్కి తగ్గాయ్. మొన్నటి వరకు బీజేపీని టార్గెట్ చేసిన కేసీఆర్, కేటీఆర్ పా పార్టీపై ఇప్పుడు పెద్దగా కామెంట్స్ కూడా చేయడం లేదు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×