E-Paper
Advertisement

IT Knowledge Hub: రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్.. 5 లక్షల మందికి ఉద్యోగాలు..

IT Knowledge Hub: రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్.. 5 లక్షల మందికి ఉద్యోగాలు..
Advertisement

IT Knowledge Hub: హైదరాబాద్ మహా నగరంలోని పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్‌ హబ్‌ ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఐటీ నాలెడ్జ్‌ హబ్‌ ఏర్పాటు చేయడం వల్ల 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు.

ఐటీ నాలెడ్జ్ హబ్‌ పై సచివాలయ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు లు అధికారులతో సమీక్షా సమావేశ నిర్వహించారు. హైదరాబాద్ మహా నగరంలోని పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాట్లపై  మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయడం వల్ల దాదాపు ఐదు లక్షల మంది యువతకు ఉపాధి లభించడమే  లక్ష్యమని వారు తెలిపారు.

Advertisement

హైదరాబాద్  మహా నగరం ప్రగతిని మరింత వేగవంతం చేయాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నది. అంతేకాదు.. ఐటీ రంగంలో ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని కమిటీ నిర్ణయించింది. కాగా, ఐటీ నాలెడ్జ్ హబ్‌ కు కేటాయించిన 450 ఎకరాల భూమిని గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్‌లు, రెవెన్యూ, స్పెషల్‌ పోలీస్‌ సొసైటీలకు కేటాయించారు. వివిధ సొసైటీలకు 200 ఎకరాల భూమి.. పక్కనే ఉన్న మరో 250 ఎకరాల భూములు కలిపి ఐటీ హబ్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

Also Read: ESIC Recruitment: ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌‌లో 558 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.78,800..

Advertisement

Also Read: HURL Recruitment: ఈ జాబ్ వస్తే రూ.1,00,000కి పైగా జీతం.. ఈ అర్హత ఉన్న వాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×