E-Paper
Advertisement

BRS : ఓటమిని కావాలనే కేటీఆర్ పార్టీలోకి తెచ్చుకుంటున్నారా?

BRS : ఓటమిని కావాలనే కేటీఆర్ పార్టీలోకి తెచ్చుకుంటున్నారా?
Advertisement

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ జగిత్యాల పర్యటనకు వెళ్లారు. ఆయన వస్తున్నారని తెలిసి జగిత్యాల బీఆర్ఎస్ కేడర్ పెద్దఎత్తున ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.ఉన్నట్టుండి ఆయన జిల్లా టూర్ మీద పలువురు అనుమానం వ్యక్తం చేస్తుండగా.. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రిని పార్టీలోకి రావాలని ఆహ్వానించేందుకు ఆయన వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.తనకు అవమానం జరిగిందని, ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. కనీసం విజ్ఞప్తి కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ జీవన్ రెడ్డి కాంగ్రెస్‌తో తన 40 ఏండ్ల రాజకీయ ప్రయాణాన్ని ముగించిన విషయం తెలిసిందే. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్ మీద నిర్ణయం తీసుకుంటానని సైతం ప్రకటించారు.

బీఆర్ఎస్‌లో చేరుతారా?

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన అనర్హత పిటిషన్ విచారణలో భాగంగా తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని.. ఆ పార్టీకి రాజీనామా చేయలేదని, పార్టీ అధిష్టానం సైతం తనును సస్పెండ్ చేయలేదని స్పీకర్‌కు అఫిడవిట్ సమర్పించారు. ఇక తన సొంత నియోజకవర్గంలో వలస ఎమ్మెల్యే అయిన సంజయ్ కుమార్ పెత్తనం పెరగడంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అధిష్టానం సంజయ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం, ఆయన సూచించిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకపోడంతో తీవ్రంగా హర్ట్ అయ్యారు.అందుకే పార్టీకి గుడ్ బై చెప్పారు. కాగా, ఆయన కేటీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరుతారా? అనేది తెలియాల్సి ఉన్నది.

కండిషన్ పెడతారా?

Advertisement

ఒకవేళ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడితే పలు షరతులను కేటీఆర్ ముందు ఉంచుతారని చర్చ జరుగుతున్నది. ఎందుకంటే సంజయ్ కుమార్ వల్లే ఆయన అధికారంలో ఉన్న కాంగ్రెస్‌‌కు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నది. వచ్చే టర్ములో ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మరల సంజయ్ కుమార్‌ను పార్టీలోకి పిలువద్దని.. తన నియోజకవర్గంలో పూర్తి బాధ్యతలు తనకే ఇవ్వాలని.. ఎవరి జోక్యం ఉండరాదని, మంత్రి పదవితో పాటే కేడర్‌కు సముచిత గౌరవం కల్పించాలని పలు షరతులను కేటీఆర్ ముందు పెడతారని టాక్ వినిపిస్తోంది. మరి జీవన్ రెడ్డి షరతులకు కేటీఆర్ ఓకే చెబుతారా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జీవన్ రెడ్డి రాకతో విజయం వరిస్తుందా?

Advertisement

జీవన్ రెడ్డి ఇప్పటికే రెండు పర్యాయాలు జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన వయసు కూడా మీద పడటంతో పార్టీకి పెద్ద ఉపయోగం లేదని కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను లైట్ తీసుకున్నదని , నియోజకవర్గంలోనూ ఆయన ప్రభావం తగ్గిందని ప్రచారం జరుగుతోంది.అందుకే సంజయ్ వంటి నేత అవసరం అని కాంగ్రెస్ భావించిందని టాక్. కాగా, కాంగ్రెస్ వదిలేసిన బాణాన్ని బీఆర్ఎస్ ఏ విధంగా ఉపయోగించుకోనున్నది. వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఒకవేళ బీఆర్ఎస్ గుర్తుమీద పోటీ చేసి ఓడిపోతే ఆయన పరిస్థితి ఏంటి? ఆయన్ను నమ్ముకున్న కేడర్ పరిస్థితి ఏంటి? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఆయన జనాల్లో ఉండటం లేదని, కేవలం పదవుల కోసం లాబీయింగ్ చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఓడిపోయే బాణాన్ని కేటీఆర్ పార్టీలోకి తెచ్చుకుని ఏం చేస్తారని నెట్టింట జోరుగా చర్చ జరుగుతున్నది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×