E-Paper
Advertisement

Palla Rajeshwar Reddy: కేసీఆర్ ను వేధించ‌డ‌మే ప్ర‌జా ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మా? ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Palla Rajeshwar Reddy: కేసీఆర్ ను వేధించ‌డ‌మే ప్ర‌జా ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మా?  ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు!
Advertisement

Palla Rajeshwar Reddy:  తెలంగాణ సాధ‌కుడు, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని వేధించ‌డ‌మే ప్ర‌జా ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మా అని జ‌న‌గామ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి ప్ర‌శ్నించారు.కేసీఆర్‌ను సిట్ ఫోన్ ట్యాపింగ్ ఆంశంలో నందిన‌గ‌ర్‌లో విచారించిన నేప‌థ్యంలో ఆగ్ర‌హించిన బీఆర్ఎస్ శ్రేణులు జ‌న‌గ‌మ ప‌ట్ట‌ణంలో న‌ల్ల జెండాల‌తో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. అంబేడ్క‌ర్ చౌర‌స్తాలో మాన‌వ‌హారం నిర్వ‌హించారు.

అక్ర‌మ అరెస్టులు, కేసుల‌తో బీఆర్ఎస్‌ను విచ్చిన్నం

ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ‌ను సాధించి, ప‌దేళ్ళు పాలించి, అభివృద్ది చేసిన కేసీఆర్‌ను ఫోన్ ట్యాపింగ్ పేరుతో సిట్ విచారించ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ప్ర‌జా సంక్షేమ‌మే ధ్యేయంగా ప‌నిచేసిన ఒక ఉద్య‌మ‌కారుడిని సిట్ విచార‌ణ పేరుతో పిల‌వ‌డం అవ‌మానించ‌డ‌మే అని అన్నారు. సిట్‌ల‌తో, కేసుల‌తో కేసీఆర్‌ను, ఆయ‌న కుటుంబాన్ని, తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌ను ఏమి చేయలేర‌ని అన్నారు. అక్ర‌మ అరెస్టులు, కేసుల‌తో బీఆర్ఎస్‌ను విచ్చిన్నం చేయాలంటే అది ఎవ్వ‌రి వ‌ల్ల కాద‌న్నారు.కేసీఆర్‌ను విచారించడం కేవ‌లం క‌క్ష‌సాధింపు చ‌ర్యే అని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా, విచార‌ణ‌లు చేసినా భ‌య‌ప‌డేది లేద‌న్నారు.

Advertisement

Also Read: Sabitha Indra Reddy: రాజకీయ లబ్ధి కోసమే కేసిఆర్ కు నోటీసులు.. రెండేళ్ల కాంగ్రెస్ పాలన అవినీతిమయం : మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి!

కేసీఆర్ ను ట‌చ్ చేస్తే అగ్నిగుండ‌మే

మాజీ సీఎం కేసీఆర్‌ను టచ్ చేస్తే రాష్ట్రం అగ్ని గుండం అవుతుందని ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. కేఆర్ ను సిట్ విచారించిన సంద‌ర్భంగా బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రంలోని శివాజీ సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సంద‌ర్భంగా పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ నాటకం ఆడుతుందన్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌ ను ఓడించాల‌నే ఎత్తుగ‌డ‌లో భాగంగానే ఇలా సిట్ పేరుతో నాట‌కాలు ఆడుతుంద‌న్నారు. ఎన్ని కేసులు పెట్టినా, విచార‌ణ‌లు చేసిన బీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయ‌లేర‌ని అన్నారు.

Advertisement

Also Read: Basit Ali: ఈ కాటేర‌మ్మ కొడుకుల‌ నుంచి పాక్ ను కాపాడాలంటే, ఆ అల్లా దిగిరావాల్సిందే

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×