E-Paper
Advertisement

IPS Transfers : హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండకు కొత్త పోలీస్ బాస్‌లు..

IPS Transfers : హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండకు కొత్త పోలీస్ బాస్‌లు..
Advertisement

IPS Transfers : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రతి డిపార్ట్ మెంట్ లో ప్రక్షాళన కొనసాగుతోంది. తాజాగా పోలీస్ శాఖలోనూ మార్పులు చేర్పులు షురూ అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కమిషనరేట్లకు కొత్త బాస్ లను సీఎం రేవంత్ రెడ్డి నియమించారు.

హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి,సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్ బాబును నియమించారు. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరక్టర్‌గా సందీప్ శాండిల్యకు బాధ్యతలు అప్పగించారు. దేవేంద్ర సింగ్ ను చౌహాన్ , స్టిఫెన్ రవీంద్రను డీజీపీ ఆఫీస్ కు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Advertisement

హైదరాబాద్ కొత్త సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.. ప్రస్తుతం అడిషనల్ డీజీగా ఉన్నారు. రాచకొండ కొత్త సీపీ సుధీర్ బాబు.. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో అడిషనల్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. సైబరాబాద్ కొత్త సీపీ అవినాష్ మహంతి ప్రస్తుతం సైబరాబాద్ అడ్మిన్ విభాగంలో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్నారు.

తెలంగాణలో ఎన్నికలకు ముందు హైదరాబాద్ కు సీవీ ఆనంద్, సైబరాబాద్ కు స్టిఫెన్ రవీంద్ర, రాచకొండకు మహేష్ భగవత్ సీపీలుగా ఉన్నారు. ఎన్నికల సమయంలో హైదరాబాద్ సీపీ బాధ్యతల నుంచి సీపీ ఆనంద్ ను తప్పించి సందీప్ శాండిల్యను ఈసీ నియమించింది. అలాగే ఆ సమయంలో రాచకొండ సీపీ బాధ్యతలు దేవేంద్ర సింగ్ చౌహాన్ అప్పగించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు కొత్త సీపీలను నియమించింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×