E-Paper
Advertisement

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం.. రంగంలోకి ఇంటర్ పోల్

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం.. రంగంలోకి ఇంటర్ పోల్
Advertisement

Phone Tapping Case: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇంటర్ పోల్ రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులైన స్పెషల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్​రావు, ఓ మీడియా సంస్థ మాజీ ఎండీ శ్రవణ్ రావుపై రెడ్​కార్నర్ నోటీసుల జారీ ప్రక్రియ స్పీడప్ అయింది. మరి కొద్ది రోజుల్లో ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంటర్​పోల్ సేకరించినట్లు తెలుస్తోంది. సీబీఐ సిఫార్సుతో అందిన కేస్ డాక్యుమెంట్ల ఆధారంగా ప్రాసెస్ చేస్తున్నట్లు సమాచారం. రెడ్‌‌ కార్నర్ నోటీసులు జారీ చేసే ప్రక్రియలో భాగంగా ఇన్వెస్టిగేషన్‌‌ అధికారులను ఇంటర్‌‌‌‌పోల్‌‌ పలు వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

Advertisement

ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ జరిగినట్లు నిరూపించే సాంకేతిక ఆధారాలతో పాటు మరికొన్ని అనుమానాలను నివృత్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్యూరోక్రాట్స్‌‌, ప్రభుత్వ, ప్రైవేట్‌‌ వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపై ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ ఎంత ప్రభావం చూపిందో ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇంటర్​పోల్​కు చెప్పినట్లు తెలుస్తోంది.

Also Read: బీఆర్ఎస్ నేతల్లో గందరగోళం.. ఏం మాట్లాడాలి.. ఏం మాట్లాడకూడదు?

Advertisement

అమెరికాలో షెల్టర్ తీసుకున్న ప్రభాకర్ రావు, శ్రవణ్‌‌ రావు ప్రతిరోజు అక్కడ కలుసుకుంటున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ పోలీస్ అధికారుల బెయిల్స్‌‌, రెడ్‌‌కార్నర్ నోటీసుల ప్రక్రియను తెలుసుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. వీరిద్దరి పాస్ పోర్టులు వీరిద్దరి పాస్‌‌పోర్టులు జప్తు, లుకౌట్ సర్క్యులర్స్ ఇప్పటికే జారీ అయ్యాయి.

ఇక.. రెడ్‌‌కార్నర్ నోటీసులు కూడా జారీ అయితే.. పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఏ దేశంలో ఉన్నా సరే.. ఇంటర్‌‌‌‌పోల్ అరెస్ట్ చేసి ఇండియాకు పంపేస్తారు. అయితే ఇంటర్‌‌‌‌పోల్ అరెస్ట్‌‌ చేయడానికి ముందే వాళ్లిద్దరూ ఇండియాకు తిరిగి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే శ్రవణ్‌‌ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×