E-Paper
Advertisement

IR Increase : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. వారికి పెరగనున్న జీతాలు

IR Increase : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. వారికి పెరగనున్న జీతాలు
Advertisement

IR Increase : రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరికొద్ది రోజుల్లోనే ఏడాది పరిపాలన పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాల సందర్భంగా ప్రభుత్వ రంగ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది.  తెలంగాణలోని  అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులకు  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా మధ్యంతర భృతి – ఐఆర్ (ఇంటీరిమ్ రిలీఫ్) ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ రంగ సంస్థల్లోని వేలాది మంది ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి.

ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులకు ప్రస్తుతం అందుతున్న మూలధన వేతనంపై  5 శాతం మధ్యంతర భృతి మంజూరు చేస్తూ  తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో..  ఈ రంగంలోని ఉద్యోగులకు పెరిగిన జీతాలు అందుకోనున్నారు.

Advertisement

క్రితం ఏడాది అక్టోబర్ లో ప్రభుత్వ ఉద్యోగులు, ఫించన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం మధ్యంతర భృతిని పెంచింది. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఆ నిర్ణయంతో లబ్ధి పొందారు. కాగా.. వారికి సైతం అప్పట్లో 5 శాతమే మధ్యంతర భృతిని అందించారు. ఇప్పుడు.. ప్రజా విజయోత్సవాల నేపథ్యంలో మిగతా ఉద్యోగుల నుంచి వస్తున్న వినతులను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. అందరికీ మేలైన నిర్ణయం తీసుకోవాలని భావించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో  ప్రభుత్వ రంగ ఉద్యోగులకు సైతం మధ్యంతర భృతిని మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read : కేటీఆర్ నువ్వు జైలుకే.. తొందరెందుకు వెయిట్ అండ్ సీ.. మంత్రి సురేఖ కామెంట్స్

Advertisement

ఈ నిర్ణయంతో యూనివర్శిటీ, కాలేజీల్లో పని చేస్తున్న వేలాది మంది అధ్యాపకులకు లబ్ధి చేకూరనుంది. అలానే.. కో ఆపరేటివ్ సొసైటీల్లో పని చేస్తున్న సిబ్బంది జీతభత్యాలు సైతం పెరగనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఈ ఉద్యోగ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఎప్పటి నుంచో చేస్తున్న విజ్ఞప్తుల్ని పరిగణలోకి తీసుకుని నూతన ఏడాదిలో శుభవార్త అందించారని ఆనందపడుతున్నారు. ఏడాది పాలన తర్వాత నిజంగానే గుడ్ న్యూస్ చెప్పారంటూ ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×