E-Paper
Advertisement

Rahul Gandhi: రాహుల్ గురించి ఎవరికీ తెలీని మేటర్.. జాబ్, ప్రేమ, పెళ్లి డీటైల్స్..

Rahul Gandhi: రాహుల్ గురించి ఎవరికీ తెలీని మేటర్.. జాబ్, ప్రేమ, పెళ్లి డీటైల్స్..
Advertisement

Rahul Gandhi: హీరో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ డార్లింగ్ కు పెళ్లెందుకు ఆలస్యం అవుతోంది? చెప్పడం కష్టమే. త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటారు మన బాహుబలి.

మరి, రాహుల్ గాంధీ పెళ్లి ఎప్పుడు? ఇది కూడా బేతాళ ప్రశ్నే. సమాధానం చెప్పడం రాహుల్ కూ కష్టమే. కానీ, తొలిసారి తన పెళ్లి గురించి హింట్ ఇచ్చారు కాంగ్రెస్ యువరాజు. తనకు లవ్ మ్యారేజీనే అవుతుందని పరోక్షంగా చెప్పారు. ఇంతకీ రాహుల్ గాంధీ ఏమన్నారంటే…

Advertisement

పెళ్లికి తాను వ్యతిరేకం కాదని.. సరైన అమ్మాయి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానన్నారు రాహుల్‌. ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి, ఫుడ్ హాబిట్స్, చదువు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

“మా అమ్మానాన్నలది ప్రేమ వివాహం. వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అందుకే నా అంచనాలు కూడా కాస్త పైనే ఉంటాయి. అయితే, సరైన అమ్మాయి వస్తే తప్పకుండా వివాహం చేసుకుంటా. ప్రేమించే వ్యక్తి, తెలివైన అమ్మాయి అయితే చాలు” అని రాహుల్ గాంధీ అన్నారు.

Advertisement

ఇప్పటికే వయసు మీద పడింది. తెల్ల జుట్టు, తెల్ల గడ్డం కూడా వచ్చేసింది. మరి, ఆయన కోరుకుంటున్న సరైన అమ్మాయి ఎప్పుడు దొరకాలి? ఎప్పుడు ప్రేమించాలి? రాహుల్ పెళ్లి ఎప్పుడు కావాలి? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే.

ఇక, రాహుల్ గాంధీ తన చదువు గురించి మరిన్ని వివరాలు చెప్పారు. అప్పటి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తాను ఇంట్లోనే ఉండి చదువుకోవాల్సి వచ్చిందన్నారు. నానమ్మ చనిపోయిన తర్వాత తనను బోర్డింగ్‌ స్కూల్‌ నుంచి తీసుకొచ్చేసారని.. ఆ తర్వాత నుంచీ ఇంట్లోనే చదువు చెప్పించారని గుర్తు చేసుకున్నారు. అయితే, హైయ్యర్ ఎడ్యుకేషన్ కోసం తాను హార్వర్డ్‌కు వెళ్లానని.. నాన్న రాజీవ్ గాంధీ హత్య తర్వాత అక్కడి నుంచి తనను ఫ్లోరిడాకు పంపించారని చెప్పారు.

చదువు పూర్తయ్యాక లండన్‌లో ఓ కన్సల్టెన్సీ కంపెనీలో ఉద్యోగం చేశారట రాహుల్ గాంధీ. ఇంతకీ, ఆయన తొలి శాలరీ ఎంతో తెలుసా? 2500 పౌండ్లు.

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×