E-Paper
Advertisement

Telangana Budget 2026: తెలంగాణ బడ్జెట్‌లో కొత్త పథకం.. ప్రతి కుటుంబానికి జీవిత బీమా

Telangana Budget 2026: తెలంగాణ బడ్జెట్‌లో కొత్త పథకం.. ప్రతి  కుటుంబానికి జీవిత బీమా
Advertisement

Telangana Budget 2026: తెలంగాణ బడ్జెట్-2026లో రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా 1.15 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. రూ. 5 లక్షల వరకు జీవిత బీమా కల్పిస్తామన్నారు. పేద-ధనిక అనే తేడా లేకుండా రాష్ట్ర ప్రజలందరికీ వర్తింపజేస్తామని ప్రకటించారు.

తెలంగాణ బడ్జెట్‌-2026లో కొత్త పథకం

Advertisement

తెలంగాణ ప్రజలకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమాను కల్పించనున్నట్లు బడ్జెట్‌లో ప్రస్తావించింది. 2026-27 బడ్జెట్‌ సందర్భంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సభలో ఈ ప్రకటన చేశారు. దాదాపు 1.15 కోట్ల కుటుంబాలకు ఈ పథకం అందనుంది.

ప్రతీ ఫ్యామిలీకి రూ.5 లక్షల జీవిత బీమా అందనుంది. దీనికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అని పేరు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు అంటే జూన్ 2 నుంచి ఈ పథకం అమల్లోకి రానున్నట్లు తెలిపారు. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా అన్ని‌వర్గాల వారికి ఈ పథకాన్ని వర్తింప జేస్తామని వెల్లడించారు.

Advertisement

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకం

కుటుంబ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేస్తామని ఆర్థికమంత్రి భట్టి ప్రకటించారు. దీనివల్ల పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది. తెలంగాణలో జన్మించడం, జీవించడం ఒక వరంగా మారేలా చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

కుటుంబంలో ఇంటి యజమాని అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం అనుభవించే మానసిక వేదన, వారు ఎదుర్కొనే ఆర్థిక సంక్షోభం మరొక ఎత్తని అన్నారు. ఇలాంటి ఘటన వల్ల ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ బిడ్డలెవరూ అలాంటి భయం, అభద్రతా భావంతో జీవించ కూడదన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమన్నారు.

ALSO READ: జనం మెచ్చితే ఎవరు ఆపుతారు?

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×