E-Paper
Advertisement

Dharna Chowk : ఇందిరా పార్క్ వద్ద ముగిసిన ధర్నా.. పెద్దఎత్తున పాల్గొన్న ఇండియా కూటమి పార్టీలు..

Dharna Chowk : ఇందిరా పార్క్ వద్ద ముగిసిన ధర్నా.. పెద్దఎత్తున పాల్గొన్న ఇండియా కూటమి పార్టీలు..
Advertisement

Dharna Chowk : హైదరాబాద్ ధర్నాచౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆందోళన విరమించింది. పార్లమెంట్ లో విపక్ష ఎంపీల బహిష్కరణను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఉవ్వెత్తున నిరసనకు దిగాయి. ఇండియా కూటమి దేశవ్యాప్త ఆందోళన పిలుపు నేపథ్యంలో తెలంగాణలోనూ శాంతియుత ధర్నా కార్యక్రమాలు జరిగాయి.

హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ఆందోళనలు నిర్వహించారు. సేవ్ డెమోక్రసీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ర్యాలీలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కొనసాగిన ఆందోళనకు సీపీఐ,టీజేఎస్,ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చారు.

Advertisement

పార్లమెంటులో విపక్ష ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ధర్నాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అనేక మంది త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని.. ప్రస్తుతం అరాచక పాలనలో దేశం మగ్గుతోందని ఆయన తెలిపారు. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై ఇప్పటి వరకూ కేంద్ర హోంమంత్రి నుంచి ఎలాంటి సమాధానం రావడంలేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×