E-Paper
Advertisement

Heavy Rains: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షం.. జనం అతలాకుతలం.. బయటకు వెళ్లోద్దు

Heavy Rains: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షం.. జనం అతలాకుతలం.. బయటకు వెళ్లోద్దు
Advertisement

Heavy Rains: హైదరాబాద్ మహానగరంలోని భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా.. అనేక ప్రాంతాల్లో రహదారులపైకి భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. అదివారం సెలవు దినం అయినా.. రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్అవ్వడంతో వాహనాలు మెల్లగా సాగుతున్నాయి. ట్రాపిక్‌ను తొలగించడానికి పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.

సికింద్రాబాద్‌లో దంచికొట్టిన భారీ వర్షం
రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్రఅవస్థలు పడుతున్నారు. బేగంపేట్ ప్రకాష్ నగర్‌లో మోకాళ్ల లోతు నీరు చేరింది. వర్షం పడిన ప్రతీసారి తమకు ఈ బాధలు తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

పలు ప్రాంతాలు జలమయం..
అంతేకాకుండా.. ఫిలింనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాలు జలమయమైనాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టాయి.

విద్యుత్ లేక ప్రజల కష్టాలు..
మరోవైపు.. భారీ వర్షాలు కారణంగా.. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని ప్రధాన రహదారుల్లోని వీధి దీపాలు సైతం వెలగడం లేదు. ఇక భారీ వర్షానికి ఈదురు గాలులు సైతం తొడయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

మరో మూడు రోజులు భారీ వర్షాలు..
అయితే.. తెలంగాణలో ఇంకా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయిలో ఈఎన్‌సీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×