E-Paper
Advertisement

Weather Updates: తెలంగాణ, ఏపీలకు వాన కబురు.. భారీ వర్ష సూచన, ఆ జిల్లాలకు అలర్ట్

Weather Updates: తెలంగాణ, ఏపీలకు వాన కబురు.. భారీ వర్ష సూచన, ఆ జిల్లాలకు అలర్ట్
Advertisement

Weather Updates: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వివిధ రాష్ట్రాలను వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం మీదుగా కేంద్రీకృతమై అల్పపీడనం.. తొలుత పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని తెలిపింది. రానున్న 48 గంటల్లో ఈశాన్య దిశగా రావచ్చని తెలిపింది. ఫిబ్రవరి 23 అనగా నేటి నుంచి అనేక ప్రాంతాలలో భారీ వర్షాలతోపాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

Advertisement

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల్లోని వివిధ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆ శాఖ.

సముద్ర మట్టానికి ఎత్తులో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వరకు విస్తరించింది. దీని కారణంగా సోమవారం నుంచి రెండురోజులు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు అధికారులు. వర్ష ప్రభావం దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో అధికంగా ఉండనుంది.

Advertisement

తెలుగు రాష్ట్రాలకు వాన కబురు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, నాగర్ కర్నూలు సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.  ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీని ప్రభావం మంగళవారం కూడా  కొనసాగనుంది.  హైదరాబాద్ సిటీలో ఆకాశం మేఘావృతమై ఉండనుంది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి జల్లులు పడొచ్చని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా చీడికాడ, తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్ మొదలు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు ఉంటాయని తెలిపింది.

ALSO READ: ఎంపీటీపి, జెట్‌పీటీసీ ఎన్నికల్లో మా సత్తా ఎంటో చూపిస్తామన్న మహేశ్వర్ రెడ్డి

అస్సాం, మేఘాలయ, బెంగాల్, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఇక పశ్చిమ హిమాలయ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్‌లో ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ఉత్తరాఖండ్‌లో హిమపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×